సినిమా వాళ్లు కనబడితే చాలు మన వాళ్ళకి పండగే పండగ. దగ్గరకి వెళ్ళాలి. సెల్ఫీలు తీయాలి..ఫేస్ బుక్ లో పెట్టాలి లోకమంతా చాటింపు వెయ్యాలి. ఇలా అభిమానులు ఆగమాగం చేస్తుంటారు. ఇక షాపింగ్ మాల్స్ అంటారా...పెద్ద ఎత్తున అభిమానులు వచ్చేసి పోలీసుల లాఠీలతో కూడా కొట్టించుకుంటూ ఉంటారు.
అయితే ఇక్కడ మాత్రం నెత్తి మీద ముసుగు, మూతికి మాస్కు వేసుకున్న సాయిపల్లవి ఒక్కసారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యక్షమైంది. పరీక్షలు రాయడానికి ఆమె చెన్నైలోని ఒక ప్రాంతానికి వచ్చింది. వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయింది కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం విద్యార్థులు గుర్తు పట్టేశారట.
ఇంకేముంది సెల్ఫీలతో హోరెత్తించారు. సాయిపల్లవి తన మాస్కును తీసి మరీ ఫోటోలకు ఫోజిచ్చింది. దూరం దూరంగా ఉండంటి అంటూ అందరికీ విజ్ఙప్తి చేసింది. ఎందుకంటే కరోనా ఉండడంతో ఆమె ఈ విషయాన్ని చెప్పింది. అయితే ఈమె పరీక్షా హాలుకు వచ్చినప్పుడు చాలా సింపుల్ గా కనిపించిందట.
కారులో దిగడం నేరుగా పరీక్షా హాలుకు రావడం.. వెనుకల గన్ మెన్ లు గానీ ఇంకెవరూ లేరట. కారును మాత్రం ఎవరో నడుపుకుంటూ వచ్చారట. అయితే ఆమెను వదిలిందే కారు కూడా వెళ్ళిపోయిందట. దీంతో మొదట్లో ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదు. కానీ పరీక్ష తరువాత బయటకు వచ్చిందే ఒక్కసారిగా గుర్తు పట్టేశారట. మొదట్లో కాస్త సాయిపల్లవి ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం ఫోటోలకు ఫోజిచ్చారట.