Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు అలా మారడానికి పురుషులే కారణం : హీరోయిన్ సదా

'జయం' చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైన నటి సదా. అజిత్‌, విక్రమ్‌ వంటి అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది.

Advertiesment
మహిళలు అలా మారడానికి పురుషులే కారణం : హీరోయిన్ సదా
, ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (15:04 IST)
'జయం' చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైన నటి సదా. అజిత్‌, విక్రమ్‌ వంటి అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది. కానీ అవకాశాల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది.
 
ఈ నేపథ్యంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'టార్చ్‌లైట్' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1980ల్లో వేశ్యల జీవితంతో ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో సదా వేశ్యగా నటించింది. అలాగే 'కబాలి' ఫేమ్‌ రిత్విక కూడా వేశ్యగా కనిపించనుంది.
 
ఈ సినిమా గురించి సదా మాట్లాడుతూ.. 'నేను ఇంతవరకు పాత్రలో నటించలేదు. మొదట్లో ఇది కూడా సాధారణమైన పాత్రగానే భావించాను. కానీ, ఇష్టం లేని వృత్తిలో మహిళలు ఎంతగా నలిగిపోతున్నారో వేశ్య పాత్రలో నటిస్తుంటే అర్థమైంది. మహిళలు ఎవరూ ఇష్టపడి ఈ వృత్తిలోకి రావడం లేదు. వారు అలా మారడానికి పురుషులే కారణం. వేశ్యల జీవితాల్లో చీకటివెలుగుల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం' అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమాన సామ్రాజ్య సార్వభౌముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు : పరుచూరి