Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాధికతో చేతులు కలపనున్న బిచ్చగాడు.. ఫిబ్రవరి నుంచి షూటింగ్..

బిచ్చగాడు సినిమాతో 2016 టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన విజయ్ ఆంటోనీ.. సైతాన్‌గా అలరించలేకపోయాడు. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ ఎంపికలో విజయ్ ఆంటోనీ ఆచితూచి అడుగేస్తున్నాడు. ''సలీం'', 'నాన్‌' చిత్రాలతో

Advertiesment
Radhika Sarathkumar
, బుధవారం, 4 జనవరి 2017 (12:26 IST)
బిచ్చగాడు సినిమాతో 2016 టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన విజయ్ ఆంటోనీ.. సైతాన్‌గా అలరించలేకపోయాడు. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ ఎంపికలో విజయ్ ఆంటోనీ ఆచితూచి అడుగేస్తున్నాడు. ''సలీం'', 'నాన్‌' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్‌ ఆంటోని గత ఏడాది 'పిచ్చైక్కారన్‌'లో అందర్నీ సెంటిమెంట్‌తో కట్టిపడేశారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఆయన 'ఎమన్‌'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 
 
ఈ సినిమా తర్వాత ఐ పిక్చర్స్‌ బ్యానరుపై రాధిక నిర్మాతగా ఓ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. చిత్ర విశేషాల గురించి విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ.. తాను సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించినప్పుడు తనకు రాధిక ఆఫర్లిచ్చారు. 
 
సంగీత దర్శకుడిగా తనకు గుర్తింపు లభించేందుకు ఆమే కారణమన్నారు. ప్రస్తుతం రాధిక మేడమ్ బ్యానర్‌లో నటించడం.. సొంత పతాకంపై నటించే ఫీలింగ్‌ను ఇస్తుందని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కానుందని విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఖైదీ' ముఖ్యఅతిథుల లిస్టు నుంచి పవన్ ఔట్... దర్శకదిగ్గజాల పేర్లు ఖరారు!