Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్క చిత్రంలోనైనా డాక్టర్‌గా అవకాశం ఇవ్వండి.. ప్లీజ్ : ప్రణీత

కన్నడ భామ ప్రణీత. తమిళంలో 'ఉదయన్‌', 'శకుని', 'మాస్‌' వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో జై హీరోగా చేస్తున్న 'ఎనక్కు వాయిత్త అడిమైగల్‌'లో ఆమె కథానాయిక కాగా, అధర్వ నటి

ఒక్క చిత్రంలోనైనా డాక్టర్‌గా అవకాశం ఇవ్వండి.. ప్లీజ్ : ప్రణీత
, గురువారం, 22 డిశెంబరు 2016 (11:53 IST)
కన్నడ భామ ప్రణీత. తమిళంలో 'ఉదయన్‌', 'శకుని', 'మాస్‌' వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం జై హీరోగా చేస్తున్న 'ఎనక్కు వాయిత్త అడిమైగల్‌'లో ఆమె కథానాయిక కాగా, అధర్వ నటిస్తున్న 'జెమినీ గణేశనుం సురుళీరాజనుం'లో నలుగురు హీరోయిన్‌లలో ఒకరిగా కనిపించనుంది. ఈ రెండు చిత్రాలలోని పాటల్లో ఇప్పటివరకు చూపని స్థాయిలో అందాలను ఆరబోసిందట ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినా... ఆమెకు ఆశించినంత గుర్తింపు రాలేదు.
 
అయినప్పటికీ.. ఈ భామ నిరాశ చెందడం లేదు. వచ్చిన అవకాశాల్లో నటిస్తూ ముందుకు సాగుతోంది. ఈ విషయం పక్కనపెడితే.... ఈ కన్నడ భామకు ఒక ఆశ ఉందట. ఒక్క చిత్రంలోనైనా వైద్యురాలిగా నటించాలనేదే ఆ కోరికట. అందుకు ప్రధాన కారణం తన తల్లిదండ్రులు బెంగళూరులో పెద్ద డాక్టర్లు కావడమేనని వివరించింది. వారికి ఒకే కుమార్తె అయిన ప్రణీతను కూడా వైద్యురాల్ని చేయాలని వారు ఎన్నో కలలు కన్నారట. ఆమెకు సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఇటువైపు వచ్చేసిందట. నిజ జీవితంలో కాలేకపోయినా. ఒక్కసారైనా తెరపై వైద్యురాలిగా కనిపించాలని ఉందంటూ ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాళ్లపై ఆధారపడను.. నన్ను పురుషులతో సమానంగా పెంచారు: ప్రియాంక చోప్రా