Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కుమార్తెలకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది.. హీరోయిన్లే ఆ పని చేస్తే?: జీవితా రాజశేఖర్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ వివాదంతో వార్తల్లోకెక్కి.. రాజకీయాల్లోకి ప్రవేశించి.. నిర్మాతగా సినిమాలు కూడా అంతగా పేరు సంపాదించిపెట్టలేకపోవడంతో టీవీ షోలకు పరిమితమైన జీవితా రాజశేఖర్.. తన కుమార్తెల సినీ

Advertiesment
Actress Jeevitha Rajasekhar daughters ready to act in Cinemas
, సోమవారం, 26 డిశెంబరు 2016 (18:09 IST)
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ వివాదంతో వార్తల్లోకెక్కి.. రాజకీయాల్లోకి ప్రవేశించి.. నిర్మాతగా సినిమాలు కూడా అంతగా పేరు సంపాదించిపెట్టలేకపోవడంతో టీవీ షోలకు పరిమితమైన జీవితా రాజశేఖర్.. తన కుమార్తెల సినీ అరంగేట్రంపై నోరు విప్పారు. సినిమాల్లో నటించాలనే కోరిక తమ ఇద్దరు అమ్మాయిలకూ ఉందని ప్రముఖ నటి జీవిత స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని జీవితా రాజశేఖర్ వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతానికి తన ఇద్దరు కుమార్తెలను బాగా చదివించాలనే కోరికతో చదివిస్తున్నానని తెలిపారు. తమ పెద్ద అమ్మాయి శివాని మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతోందని, రెండో అమ్మాయి శివాత్మిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోందని జీవిత రాజశేఖర్ వెల్లడించారు. 
 
సినిమాల గురించి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు హీరోతో 'ఐ లవ్ యూ' అనే డైలాగ్ చెప్పడానికే ముందూ వెనుకా ఆలోచించేవారు. అప్పటి సినిమాల్లో హీరోయిన్, వ్యాంప్‌లు ఉండేవారు. ఈ రెండు పాత్రల మధ్య తేడా ఉండేది. అచ్చమైన తెలుగు ఆడపడుచుల్లా కనిపించే హీరోయిన్లను అందరూ అభిమానించేవారని చెప్పారు. 
 
కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాంపులు లేరని అంతా తాము చేస్తామని హీరోయిన్లే చెప్పేస్తున్నారని జీవిత రాజశేఖర్ తెలిపారు. హీరోయిన్లే ఐటమ్ సాంగుల్లోనూ చిందులేసేస్తున్నారని జీవితా రాజశేఖర్ వాపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాటిలైట్‌కు చిరంజీవి అమ్ముడుపోయాడు!