నటుడు విశాల్ సస్పెండ్
నటుడు విశాల్ సస్పెండ్ అయ్యారు. తమిళ సినీ పరిశ్రమలోని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా సెస్సేషన్ క్రియేట్ చేసిన ఆయనపై సోమవారం నాడు తమిళనాడు నిర్మాతల మండలి సస్పెండ్ వేటు వేసింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో పలు చిత్రాలు తీస్తూ నిర్మాతల మండలిలో
నటుడు విశాల్ సస్పెండ్ అయ్యారు. తమిళ సినీ పరిశ్రమలోని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా సెస్సేషన్ క్రియేట్ చేసిన ఆయనపై సోమవారం నాడు తమిళనాడు నిర్మాతల మండలి సస్పెండ్ వేటు వేసింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో పలు చిత్రాలు తీస్తూ నిర్మాతల మండలిలో ఆయన సభ్యుడు కూడా.
అయితే ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతల మండలిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి స్పందించిన మండలి.. ఆయన్ను వివరణ కోరింది. కానీ పట్టించుకున్నట్లు లేదని మండలి సోమవారం నాడు ప్రకటించింది. సరైన వివరణ ఇవ్వని విశాల్‌ను నిర్మాత మండలి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, నడిగర్ సంఘంలో ఎలాగైతే యువత ముందుందో.. అలాగే నిర్మాతల మండలిలోనూ వుండాలనేది విశాల్ కోరిక. దానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి.