Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినీ దిగ్గజ నటుడు వినోద్ ఖన్నా ఇకలేరు.. శోకసముద్రంలో బాలీవుడ్

బాలీవుడ్ అలనాటి నటుడు వినోద్ ఖన్నా ఇకలేరు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన... గురువారం ముంబైలోని హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

సినీ దిగ్గజ నటుడు వినోద్ ఖన్నా ఇకలేరు.. శోకసముద్రంలో బాలీవుడ్
, గురువారం, 27 ఏప్రియల్ 2017 (12:28 IST)
బాలీవుడ్ అలనాటి నటుడు వినోద్ ఖన్నా ఇకలేరు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన... గురువారం ముంబైలోని హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 70 యేళ్లు. అయితే గతంలో వినోద్ ఖన్నా క్యాన్సర్‌తో బాధపుడుతున్నారన్న వార్తలు వినిపించినా కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. ఆయన డీ హైడ్రేషన్ కారణంగానే ఆసుపత్రిలో చెరినట్టుగా సన్నిహితులు చెపుతున్నారు. 
 
వినోద్ ఖన్నా తనదైన నటన.. డైలాగ్స్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 1968లో వచ్చిన ‘మన్‌ కా మీట్‌’ చిత్రం ద్వారా వినోద్‌ ఖన్నా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. 141 చిత్రాల్లో నటించిన ఆయన చివరి చిత్రం 'దిల్ వాలే'. నటుడిగానే కాక రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు వినోద్ ఖన్నా.. 2014లో గురుదాస్ పూర్ నుంచి ఎంపికగా ఎన్నికయ్యారు. 
 
కాగా, సినిమాల్లోనే కాక రాజకీయ రంగంలో కూడా వినోద్‌ ఖన్నా రాణించారు. 2014లో గురుదాస్ పూర్ నుంచి వినోద్ ఖన్నా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. మొత్తం 141 చిత్రాల్లో నటించిన ఆయన, పలు చిత్రాలను స్వయంగా నిర్మించారు. ఇటీవల పూర్తి బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వినోద్ ఖన్నా మృతిపై బాలీవుడ్ వర్గాలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపాయి. 
 
‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గద్దర్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. చివరిసారిగా దిల్‌వాలే చిత్రంలో కన్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏకంగా 500 టిక్కెట్లను బుక్‌ చేసిన వరంగల్ కలెక్టర్