ఎం.ఎస్. నారాయణ కొడుకు విక్రమ్ నారాయణ తెలిసే వుంటుంది. ఆయన నాన్నగారు బతికున్నంతకాలం నటుడిగా మంచి గుర్తింపు పొందాలని ట్రై చేశాడు. ఇక బ్రహ్మానందం కొడుకు కూడా హీరోగా పల్లకిలో పెళ్లికొడుకుతో అయ్యాడు. కానీ ఆ తర్వాత పెద్దగా ఫలితం లేదు. ఆయన్ను పిలిచేవారు. దాన్నేఅదృష్టం అంటారని విక్రమ్ చెబుతున్నాడు. పలు సినీమాల్లో కమెడియన్‌గా, సీరియస్ పాత్రలు చేశారు. కానీ ముందుకు వెళ్లలేక పోయారు.
ఇటీవలే ఓ కార్యక్రమంలో ఆయన్ను పలుకరిస్తే, నాకు చిన్నతనం నుంచి నటుడు అవ్వాలనే కోరిక బలంగా వుండేది. గట్టిగా ట్రై చేశాను. చాలామంది సినీమాను ఇండస్ట్రీ అంటారు. ఇది ఫ్యాక్టరీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి కలిసినవారితో మరలా కలుస్తామని చెప్పలేం. ఇక్కడ జరిగేది బిజినెస్. టాలెంట్ ఉంటె చాలంటారు. అలా అయితే అభిషేక్ బచ్చన్ నెం.1 స్థాయిలో వుండాలి. టాలెంట్ వున్న వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. తరుణ్, అబ్బాస్ లాంటివారు సక్సెస్ చూశారు. కానీ మరలా వారు దూరం అయ్యారు. అందుకే అంటారు. ఇక్కడ టైం కలిసిరావాలి. దాన్నే అదృష్టం వుండాలి అంటాం అని చెప్పారు. ప్రస్తుతం తాను జాబ్ చేసుకుంటున్నాడు. ఆయన సోదరి కూడా టీవీ లో పని చేస్తుంది.