Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రిషకు మద్దతిచ్చిన మన్సూర్ అలీఖాన్.. ఏవీ రాజు క్షమాపణలు

Advertiesment
Trisha

సెల్వి

, గురువారం, 22 ఫిబ్రవరి 2024 (12:55 IST)
ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ సినీ నటి త్రిషకు మద్దతు తెలిపి.. అందరినీ ఆశ్చర్యపోయాడు. త్రిషపై అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు చేసిన చీప్ కామెంట్స్ చేశారు. ఇందుకు త్రిషకు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. 
 
అయితే అనూహ్యంగా కొన్ని నెలల క్రితం త్రిషపై వెకిలీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన మన్సూర్ కూడా ప్రస్తుతం ఈ అగ్రనటికి అండగా నిలిచాడు. త్రిషపై ఏవీ రాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మన్సూర్ అలీ ఖాన్ ఖండించాడు. 
 
తన తోటి నటీమణుల విషయంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చాలా బాధగా అనిపిస్తుందన్నాడు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మన్సూర్ డిమాండ్‌ చేశాడు. కాగా త్రిషపై చేసిన వ్యాఖ్యలకు కోర్టు మొట్టికాయలు వేయడంతో మన్సూర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపాడు. 
 
ఇదే తరహాలో తాజాగా తమిళనాడు రాజకీయ నాయకుడు, AIDMK మాజీ నాయకుడు AV రాజు, త్రిషకు క్షమాపణలు చెప్పాడు. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశాడు. ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూలో, త్రిష రిసార్ట్‌లో ఇచ్చిన వినోదానికి సెటిల్‌మెంట్‌గా ఎమ్మెల్యే నుండి 25 లక్షలు అందుకున్నట్లు పేర్కొన్నాడు. AV రాజుపై చట్టపరమైన చర్య తీసుకుంటానని ఇప్పటికే త్రిష తెలిపింది. త్రిష ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం డబ్బు తీసుకున్నట్లు తాను చెప్పలేదని ఏవీ రాజు చెప్పాడు. ఇంకా బేషరతుగా క్షమాపణలు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 11న మీరా చోప్రా వివాహం.. ఎక్కడో తెలుసా?