'ఈగ' సుదీప్‌కు తీవ్ర అస్వస్థత.. కడుపునొప్పితో బాధ.. ప్రమాదం లేదు!
'ఈగ'తో టాలీవుడ్‌కి పరిచయమైన నటుడు సుదీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''హెబ్బులి'' షూటింగ్‌లో ఉదయం నుంచి స్వల్ప అస్వస్థకి గురైన సుదీప్‌కు సాయంత్రానికి కడుపునొప
'ఈగ'తో టాలీవుడ్‌కి పరిచయమైన నటుడు సుదీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''హెబ్బులి'' షూటింగ్‌లో ఉదయం నుంచి స్వల్ప అస్వస్థకి గురైన సుదీప్‌కు సాయంత్రానికి కడుపునొప్పి తీవ్రం కావడంతో సోమవారం ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల సుదీప్ కడుపునొప్పితో బాధపడుతున్నట్లు.. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సుదీప్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో కొన్ని రోజుల పాటు తమ చిత్ర షూటింగ్ వాయిదా పడుతున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.