మాస్ మహారాజ్ రవితేజ నటించిన చిత్రం 'క్రాక్'. ఈ చిత్రం విజయంతో చాలా రోజుల రవితేజ మళ్లీ ఫాంలోకి వచ్చారు. అలాగే, ఈ యేడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
'ఖిలాడీ' సినిమా సెట్స్‌పై ఉండగానే త్రినాథరావు నక్కినతో కలిసి 68వ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఇక ఈ చిత్రానికి రవితేజ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
తాజా టాక్ ప్రకారం రవితేజ ఈ మూవీకి రూ.16 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. 'క్రాక్' చిత్రానికి రెమ్యునరేషన్‌తోపాటు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన లాభాల్లో షేర్స్ కూడా తీసుకున్నాడు. ఈ దఫా మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజ డిమాండ్‌కు అనుగుణంగా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సమ్మతించిందట.
మారుతి-యూవీ క్రియేషన్స్ కాంబోలో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రానికి మొదట రవితేజను అనుకోగా.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గించుకునేది లేదని రవితేజ చెప్పాడట. దీంతో గోపీచంద్ హీరోగా ఆ ప్రాజెక్టును మారుతి చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.