ముంబై నటి కృతిక చౌదరి హత్య.. మూడు రోజుల ముందే చనిపోయిందా? దుర్వాసన రావడంతో?
నటీమణులకు రక్షణ కరువైంది. ఈ మధ్య నటీమణులపై కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన మోడల్, నటి కృ
నటీమణులకు రక్షణ కరువైంది. ఈ మధ్య నటీమణులపై కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన మోడల్, నటి కృతికాచౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబైలోని అంధేరీలో వుంటున్న ఆమె ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెంటనే కృతిక నివాసానికి వెళ్లిచూడగా, నిర్జీవంగా కృతిక పడివుంది. కృతిక మూడురోజుల కిందటే హత్యకు గురైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
కృతిక మృతిపట్ల పలు అనుమానాలున్నాయని.. ఆమె ఇంటి గదికి వెలుపల గడివేసి వుండటం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెప్తున్నారు. హరిద్వార్ నుంచి ముంబైకి వచ్చిన కృతికా చౌదరి.. కంగనా రనౌత్ రజో సినిమాలోనూ పరిచయ్ అనే టీవీ షోలో నటించింది.