కమల్ హాసన్‌తో ఆ ముగ్గురు.. వాణీ గణపతి, సారిక, గౌతమి.. ఎలా దూరమయ్యారంటే?
లోకనాయకుడుగా, లెజెండ్‌గా పేరొందిన సినీ హీరో కమల్ హాసన్ జీవితంలో అనేకమంది మహిళలు క్రాస్ అయ్యారు. ఇటీవల 13 సంవత్సరాలు కమల్‌తో సహజీవనం చేసిన గౌతమి కమల్‌తో బ్రేకప్ తీసుకుంది. ఇదే ప్రస్తుతం తమిళనాడులో హాట
లోకనాయకుడుగా, లెజెండ్‌గా పేరొందిన సినీ హీరో కమల్ హాసన్ జీవితంలో అనేకమంది మహిళలు క్రాస్ అయ్యారు. ఇటీవల 13 సంవత్సరాలు కమల్‌తో సహజీవనం చేసిన గౌతమి కమల్‌తో బ్రేకప్ తీసుకుంది. ఇదే ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.
కమల్ సినిమాల్లో నటించిన కాలం నుంచే.. కమల్‌తో లింకుందంటే అనేక గుసగుసలు వినిపించాయి. అనేకమంది మహిళలతో కమల్ హాసన్ సన్నిహితంగా ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే కమల్ హాసన్ అధికారికంగా ముగ్గురు మహిళలను తన జీవిత భాగస్వాములుగా అంగీకరించి.. వారితో సహజీవనం చేశారు. వారెవరో చూద్దాం..
వాణి గణపతితో కమల్ :
భరతనాట్య కళాకారిణి అయిన వాణీ గణపతిని 1978వ సంవత్సరం కమల్ వివాహం చేసిపెట్టారు. పెద్దలచే వాణీ గణపతితో వివాహం నిశ్చయమైంది. వాణీ గణపతితో.. కమల్ హాసన్ పదేళ్ల పాటు సంసారం చేశారు. నటీమణి సారిక కమల్ జీవితంలో వచ్చాక వాణీ గణపతితో ఏర్పడిన విబేధాలతో ఆమెకు విడాకులిచ్చేశారు. ఈ వివాదం కారణంగా వాణీ గణపతి పెద్ద మొత్తాన్ని కమల్ నుంచి భరణంగా పొందినట్లు చెప్తున్నారు. అయితే భారీ మొత్తాన్ని భరణంగా పొందామనే వార్తల్లో నిజం లేదని వాణి గణపతి కొట్టిపారేశారు.
సారికతో కమల్..
వాణీ గణపతితో విడాకులయ్యాక సారికతో కమల్ సహజీవనం చేశారు. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. వారే శ్రుతిహాసన్, అక్షరా హాసన్. ఆపై సారిక-కమల్ వివాహం జరిగింది. ఇలా సారికతో కమల్ 1988 నుంచి 2002వరకు గడిపారు. 17 ఈ వివాహ బంధానికి 2002లో తెరపడింది.
ఇక ముచ్చటగా మూడోసారి గౌతమితో కమల్ సహజీవనం..
సారిక నుంచి తప్పుకున్న కమల్ ఆమె గౌతమి దగ్గరయ్యారు. ఆమెతో 13సంవత్సరాలు సహజీవనం చేశారు. అయితే నవంబర్ 7వ తేదీ కమల్ హాసన్‌కు బర్త్ డే రావడంతో ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని.. బ్యాడ్ గిఫ్ట్ ఇచ్చింది. కమల్ నుంచి బ్రేకప్ అయినట్లు ట్వీట్ చేసింది.