Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్యాణ్ రామ్ నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ చిత్రం

జనతా గారేజ్ చిత్రంతో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పైన భారీ స్థాయిలో తెరకెక్కనుంది. పవర్ సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రాని

Advertiesment
Actor Kalyan Ram
, శుక్రవారం, 9 డిశెంబరు 2016 (18:33 IST)
జనతా గారేజ్ చిత్రంతో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పైన భారీ స్థాయిలో తెరకెక్కనుంది. పవర్ సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. 
 
'టెంపర్ ', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్ ' చిత్రాలతో భారీ హ్యాట్రిక్‌ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్‌తో ఈ నూతన చిత్రంలో కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ అనంతరం చిత్రం పూజా కార్యక్రమం ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది. ఆ వెంటనే నిరవధికంగా షూటింగ్ జరుపుకుని, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. 
 
"సోదరుడు ఎన్టీఆర్‌తో, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై NTR 27 చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్‌లోని స్టార్‌కి, నటుడుకి న్యాయం చేసే విధంగా ఉంది. వచ్చే సంక్రాంతి సెలవుల అనంతరం చిత్రాన్ని ప్రారంభిస్తాం", అని నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. భారీ తారాగణంతో, విన్నూత్నమైన పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో ని నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియ చేయబడతాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబరు 20న `వంగ‌వీటి`కి హాజ‌ర‌వుతున్న అమితాబ్‌, నాగార్జున‌