సినీ నటుడు అలీ తన మనసులోని మాటను వెల్లడించారు. అలాగే, వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. కానీ, తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో మైనార్టీ కోటా నుంచి మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నట్టు ఈ హాస్య నటుడు తన మనసులోని మాటను వెల్లడించారు.
రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావుతో అలీ మంగళవారం వైజాగ్‌లో సమావేశమయ్యారు. మంత్రి గంటాతో ఏకాంతంగా మంతనాలు జరిపిన అలీ.. ఆ తర్వాత తన మనసులోని మాటను వెల్లడించారు. తనకు తెలుగుదేశం పార్టీతో రెండు దాశాబ్దాలుగా అనుబంధం ఉన్నారు.
అదేసమయంలో తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీలో చేరాలని తనను ఆహ్వానించలేదని చెప్పారు. అలాగే, తాను వైకాపాలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని స్పష్టంచేశారు.
అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో మాత్రం గుంటూరు నుంచి పోటీ చేయాలని ఉందని మాత్రం చెప్పారు. అలాగే, మైనార్టీ కోటాలో మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నట్టు తన మనసులోని మాటను వెల్లడించారు. ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా కలిసినట్టు చెప్పినట్టు అలీ వెల్లడించారు.