తెలుగు సినీ ఇండస్ట్రీ దుర్భరం... తమిళ సాంబార్ అమృతం... తెలుగు సాంబార్‌తో మోషన్స్...
ఆ నటుడికి ఇక్కడ ఏం చేదు అనుభవం వున్నదో కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ మీద, తెలుగు వారి మీద నటుడు అజయ్ ఘోష్ తీవ్రమైన పదజాలం ప్రయోగించారు. ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ... తమిళ సినిమా ఇండస్ట్రీ ముందు తెలుగు సినీ పరిశ్రమ ఎందుకూ పనికిరాదన్నారు. తెలుగు సినీ ఇం
ఆ నటుడికి ఇక్కడ ఏం చేదు అనుభవం వున్నదో కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ మీద, తెలుగు వారి మీద నటుడు అజయ్ ఘోష్ తీవ్రమైన పదజాలం ప్రయోగించారు. ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ... తమిళ సినిమా ఇండస్ట్రీ ముందు తెలుగు సినీ పరిశ్రమ ఎందుకూ పనికిరాదన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో వున్నంత దుర్భర పరిస్థితి తమిళ పరిశ్రమలో లేదని చెప్పిన ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు రావాలంటే కెమేరా ముందే కాదు... కెమేరా వెనుక కూడా నటించాలని అన్నారు.
అంతేకాదు... తమిళనాడులో ఎక్కడైనా ఆగిన ఆటో డ్రైవర్లను చూస్తే చక్కగా ఏ పేపరో, పుస్తకమో చదువుతూ కనబడుతారనీ, అదే తెలుగు రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లు గుట్కా, పాన్ నములుతూ కూర్చుంటారని అన్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్లి తమిళనాడులో సాంబారు అమృతంలా వుంటుందనీ, అదే తెలుగు రాష్ట్రాల్లో సాంబారు తింటే కడుపునొప్పి పట్టుకుని మోషన్స్ అవుతాయని ఎద్దేవా చేసాడు. అన్నట్లు ఈయన పూరీ జగన్నాథ్ చిత్రం జ్యోతిలక్ష్మితో పాటు తదితర చిత్రాల్లో నటించాడు.