బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనుమరాలు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్‌ల కుమార్తె అరాధ్య కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తనపై అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్న టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ అభ్యర్థించారు.
తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై ఆ యూట్యూబ్ టాబ్లాయిడ్ తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని ఆరాధ్య తన పిటిషన్‌లో పేర్కొంది. తాను మైనర్ అయినందువల్ల ఇలాంటి వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరుగనుంది.
కాగా, ఆరాధ్య బచ్చన్ గతంలోనూ ట్రోలింగ్‌కు గురైంది. తన వ్యక్తిగత జీవితమే లక్ష్యంగా ఆమెపై ట్రోల్స్ అవాకులు చవాకులు రాసుకొచ్చారు. ఈ తీరుపై అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోలింగ్‌కు అస్సలు ఆమోదయోగ్యం కాదు.
ఎవరూ దాన్ని సహించకూడదు. అయితే, ఓ పబ్లిక్ ఫిగర్‌గా ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ, నా కుమార్తెపై ట్రోలింగ్ ఏ రకంగాను సమర్థనీయం కాదు. ఏమైనా అనాలంటే నేరుగా తననే విమర్శించాలని అభిషేక్ బచ్చన్ కోరారు.