Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజ ఘ‌ట‌న‌కు థ్రిల్లింగ్ అంశాల‌తో నో పార్కింగ్‌కు విలువ చెప్పే క‌థః ఎస్‌.ద‌ర్శ‌న్‌

Advertiesment
నిజ ఘ‌ట‌న‌కు థ్రిల్లింగ్ అంశాల‌తో నో పార్కింగ్‌కు విలువ చెప్పే క‌థః  ఎస్‌.ద‌ర్శ‌న్‌
, సోమవారం, 23 ఆగస్టు 2021 (08:36 IST)
Dir. S. Darshan
సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు`. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఎస్‌.ద‌ర్శ‌న్ ఇంట‌ర్వ్యూ విశేషాలు.
 
- మాది చెన్నై. ఢ‌మ‌రుకం సినిమా కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చి తెలుగు నేర్చుకున్నాను. 2010వ సంవ‌త్స‌రంలో .. ఒక రోజున నాకు, నా స్నేహితుడికి  చెన్నైలో జ‌రిగిన నిజమైన  ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఇచట వాహ‌న‌ములు నిలుప‌రాదు అనే సినిమాను చేశాను.
 
- నేను ఢ‌మ‌రుకం సినిమాకు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను. ఆ స‌మ‌యంలో ఈ నిజ ఘ‌ట‌న‌ను నా ద‌గ్గ‌రున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్‌కు చెప్పాను. విష‌యం విన్న వాళ్లు దీన్ని ఒక సినిమాగా చేయొచ్చు అన్నారు. త‌ర్వాత నిజ‌మే క‌దా! సినిమాగా ఎందుకు చేయ‌కూడ‌దు అని నాకు అనిపించింది. 2013లో క‌థ‌ను త‌యారు చేశాను.
 
- ఇది థ్రిల్ల‌ర్ మూవీ. కేవ‌లం థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కాకుండా రొమాన్స్‌, కామెడీ, యాక్ష‌న్ అంశాల‌ను మిక్స్ చేశాను.
 
- చి.ల‌.సౌ సినిమా రిలీజ్‌కు మూడు నెల‌ల ముందు సుశాంత్‌గారికి ఈ క‌థ‌ను చెప్పాను. క‌థ ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. క‌చ్చితంగా ఈ సినిమా చేద్దామ‌ని అన్నారు.
 
- ఢమరుకం సినిమాతో పాటు మరో సినిమాకు శ్రీనివాస్ రెడ్డిగారి దగ్గర పనిచేశాను. ఆయన తండ్రిలాగా చూసుకున్నారు. వర్క్‌ను ఎంత కూల్‌గా చేయాలో ఆయ‌న ద‌గ్గ‌ర నుంచే నేర్చుకున్నాను.
 
- నేను ముందు ఈ క‌థ‌ను త‌మిళ  నెటివిటీలో త‌యారు చేసుకున్నాను. అందుకు కార‌ణం.. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు నాకు చెన్నైలోనే ఈ సినిమాకు సంబంధించిన సిట్యువేషన్ ఎదురైంది.
 
- నాకు తొలి అప్రిషియేష‌న్ హీరో సూర్య నుంచి వ‌చ్చింది. ఆయ‌న 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసిన‌ప్పుడు టాలెంట్ హంట్ పెట్టిన‌ప్పుడు నేను నా స్క్రిప్ట్‌ను పంపాను. అందులో నా స్క్రిప్ట్ సెల‌క్ట్ అయ్యింది. నేను సూర్య‌గారిని క‌లిశాను. క‌థ విన్నారు, ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. ఆయ‌న నాకు మంచి గుర్తింపు ఇచ్చేలా ప‌బ్లిసిటీ చేశారు. సినిమా చేస్తాన‌ని వాళ్లు ఎక్క‌డా చెప్ప‌లేదు. కేవ‌లం టాలెంట్ హంట్ మాత్ర‌మే అని చెప్పారు.
 
- ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్‌, నేను మంచి స్నేహితులం. పెళ్లిచూపులు చిత్రంతో ప్రియ‌ద‌ర్శికి మంచి బ్రేక్ వ‌చ్చింది. అప్పుడు త‌ను నాకు ఫోన్ చేసి తెలుగులో కొత్త క‌థ‌లు బాగా వ‌ర్క‌వుట్ అవుతున్నాయని, హైద‌రాబాద్ ర‌మ్మ‌ని చెప్పాడు. త‌న వ‌ల్ల నేను హైద‌రాబాద్ వ‌చ్చాను.
 
- మా నాన్నగారు కేశ‌న్‌. త‌మిళంలో ఆయ‌న రైట‌ర్‌,డైరెక్ట‌ర్‌. కె.ఎస్‌.ర‌వికుమార్‌గారి ద‌గ్గ‌ర‌, పాండిరాజ్ గారి దగ్గ‌ర రైటింగ్ డిపార్ట్‌మెంట్లో మా నాన్న ప‌నిచేశారు. య‌మ‌గోల మళ్లీ మొద‌లైంది సినిమాకు శ్రీనివాస్ రెడ్డిగారి దగ్గ‌ర నాన్న వ‌ర్క్ చేశారు. నేను అప్పుడు యానిమేట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. నాకు డైరెక్ష‌న్ అంటే ఇష్టం. ఎక్క‌డైనా అవ‌కాశం దొరుకుతుందేమోన‌ని వెయిట్ చేస్తూ ఉన్నాను. అదే స‌మ‌యంలో నా సోద‌రుడు కుటుంబ బాధ్య‌త‌ల‌ను తీసుకోవ‌డంతో, నేను కాస్త ఫ్రీ అయ్యాను. న‌న్ను ఎవ‌రి ద‌గ్గ‌రైనా డైరెక్ష‌న్ టీమ్‌లో జాయిన్ చేయించ‌మ‌ని నాన్న‌ను రిక్వెస్ట్ చేశాను. అప్పుడు ఇక్క‌డ ఢ‌మ‌రుకం డిస్క‌ష‌న్స్ స్టార్ట్ అయ్యింది. అలా ఇక్క‌డ‌కు వ‌చ్చాను. అప్ప‌ట్లో తెలుగు సినిమా గురించి నాకు పెద్ద‌గా తెలియ‌దు. నెమ్మ‌దిగా నేర్చుకున్నాను.
 
- ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమా విష‌యానికి వ‌స్తే నో పార్కింగ్‌లో బండి పెట్ట‌డం వ‌ల్ల ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌. సినిమా చూస్తే తెలుస్తుంది. క‌థ‌కు యాప్ట్ టైటిల్‌. ఒక‌రోజులో జ‌రిగే క‌థ‌.
 
- సుశాంత్‌గారు ఇందులో మిడిల్ క్లాస్ అబ్బాయిగా, అర్కిటెక్చ‌ర్‌గా కనిపిస్తారు. స్నేహానికి విలువ ఇస్తూ బాధ్య‌త‌గా మెలిగే అబ్బాయి. త‌న‌కు చిన్న స‌మ‌స్య ఎదుర‌వుతుంది. త‌ను అప్పుడు ఎలా ప‌రిస్థితులను ఫేస్ చేస్తాడ‌నేది క‌థ‌. హీరో ప‌నిచేసే ఆఫీసులోనే ఇంట‌ర్న్‌షిప్‌కు వ‌చ్చే అమ్మాయిగా హీరోయిన్ మీనాక్షి చౌద‌రి క‌నిపిస్తుంది. హీరోయిన్‌కు త‌న అన్నంటే ప్రాణం. హీరోయిన్ క్యారెక్ట‌ర్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
 
- ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, మా నిర్మాత‌ల‌కు మంచి ఫ్రెండ్‌. త‌ను మ్యూజిక్ చేసిన సినిమాల పాట‌లు విన్నాను. అవి బాగా న‌చ్చాయి. నేను కావాల‌నుకున్న డిఫ‌రెంట్ జోన‌ర్ సాంగ్స్‌ను ఆయ‌న చ‌క్క‌గా కంపోజ్ చేసిచ్చారు.
 
-  ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ నిర్మాత‌లు. వీరిలో ర‌విశంక‌ర్‌గారు మ‌న లెజెండ్రీ న‌టి భానుమ‌తిగారి మ‌న‌వ‌డు. ఆయ‌న సింగ‌పూర్‌లో సెటిల్ అయ్యారు. ఆయ‌న చాలా రోజులుగా త‌న ఫ్యామిలీని ఇండ‌స్ట్రీలోకి క‌మ్ బ్యాక్ చేయాల‌నుకున్నారు. అందుకోసం సినిమా చేయాల‌ని క‌థ‌లు వింటున్నారు. సుశాంత్‌గారి వ‌ల్ల నేను హ‌రీశ్‌గారిని క‌లుసుకున్నాను. త‌ర్వాత ర‌విశంక‌ర్ శాస్త్రిగారు సినిమాలో బాగం అయ్యారు. ఏక్తా మేడ‌మ్ కూడా నిర్మాణంలో భాగ‌మ‌య్యారు. సినిమాకు ఏం కావాలో, ఎదిస్తే బెట‌ర్ అవుతుందో దాన్ని అడిగి మ‌రీ ఇచ్చారు.
 
- కోవిడ్ కార‌ణంగా సినిమా విడుద‌ల ఆల‌స్య‌మైంది. ఈ మ‌ధ్య‌లో చాలా మంది మ‌మ్మ‌ల్ని ఓటీటీకి వెళ్ల‌మ‌ని అన్నారు. అయితే నిర్మాత‌లు అందుకు ఒప్పుకోలేదు. థియేట‌ర్స్‌లోనే సినిమామాను విడుద‌ల చేయాల‌ని వెయిట్ చేశారు. అందుకు నిర్మాత‌ల‌కు థాంక్స్ చెప్పుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు దశాబ్దాల సీతాకోకచిలక