Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శర్వానంద్ ఒకే ఒక జీవితం నుండి ప్రమోషనల్ సాంగ్

Advertiesment
Pramotion song
, శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:49 IST)
Pramotion song
హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.
 
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటివలే విడుదలైన ''ఒకటే కదా'' పాట సూపర్ హిట్ అయ్యింది. అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ పై ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి ''మారిపోయే'' అనే పాటని విడుదల చేశారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే స్టార్ హీరో కార్తీ స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపించి, స్వయంగా ఆయనే పాడి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. 'నేనే పాడుతున్నా'' అంటూ తనదైన శైలిలో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు కార్తీ.
 
జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం ట్రెండీ క్యాచి ట్యూన్ ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణచైతన్య  అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ముఖ్యంగా కార్తి ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు సర్ ప్రైజ్ లు ఉంటానని చిత్ర యూనిట్ ఇంతకుముందే చెప్పింది. చెప్పినట్లే కార్తి పాటతో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
 
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అమ్మ పాట, ఒకటే కదా పాటలు ట్రెండింగ్ లో వుండగా.. ఇప్పుడు విడుదలైన కార్తీ  ప్రమోషనల్ సాంగ్ మరింత జోష్ ని ఇచ్చింది.
 
సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా,  శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా, సతీష్ కుమార్ ఆర్ట్  డైరెక్టర్ గా పని చేస్తున్నారు.  తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది.
 
నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది: రచన,  దర్శకత్వం: శ్రీ కార్తీక్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
డీవోపీ: సుజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
ఆర్ట్ డైరెక్టర్: ఎన్.సతీష్ కుమార్
స్టంట్స్: సుదేష్ కుమార్
స్టైలిస్ట్: పల్లవి సింగ్, లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య
పీఆర్వో : వంశీ-శేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాన్ ఇండియా ఫ్రీ ఎడ్యుకేష‌న్ దిశ‌గాప్రొఫెసర్ సరోజ్ సూద్ స్కాలర్‌షిప్ - సోనూ సూద్