Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూస్తారు : కథానాయకుడు కిరణ్ అబ్బవరం

Advertiesment
KA- Kiran

డీవీ

, శుక్రవారం, 25 అక్టోబరు 2024 (18:03 IST)
KA- Kiran
కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క" ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు.

దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ‌"క" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. 
 
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, నా ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. గతంలో నా సినిమాలు అన్ని విషయాల్లో బాగున్నా కంటెంట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది అనే కామెంట్స్ వచ్చాయి. అందుకే కంటెంట్ మీద శ్రద్ధ తీసుకుని ‌"క" సినిమా చేశాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా కొత్తగా ప్రయత్నించాం. స్క్రీన్ ప్లే యూనిక్ గా ఉంటుంది. ‌"క"లో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. వాసుదేవ్ ప్రపంచంలోకి వెళ్లి కథకు మీరు బాగా కనెక్ట్ అవుతారు. సినిమా చూస్తున్నంత సేపూ హ్యాపీగా ఫీలవుతారు. 
 
నా సినిమాలు ఎలా ఉన్నా మీరు నాతో మొహమాటం లేకుండా చెప్పవచ్చు. మీ సజెషన్స్ తీసుకుని బెటర్ గా ప్రయత్నించిన చిత్రమే ‌"క". నా కోసమైనా థియేటర్ కు వెళ్లి ‌"క" సినిమా చూడండి. నా సినిమాలు బాగా లేదు అని గతంలో చెప్పి వాళ్లే ఫస్ట్ డే ‌"క" సినిమా చూడాలని కోరుకుంటున్నా. మా సినిమాలో సీజీ వర్క్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. మంచి క్వాలిటీతో ఆ వర్క్ చేసేందుకు మా డైరెక్టర్ సందీప్ ఈ ఈవెంట్ కు రాలేకపోయారు. మ్యూజిక్ చేసిన సామ్ సీఎస్ గారికి థ్యాంక్స్. మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‌
 
"క" సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు. ఆయన నాకు మా టీమ్ కు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మనం మంచి సినిమా చేశామంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు నేనుప్రామిస్ చేస్తున్నా దీపావళి పండుగకు మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్లండి, ‌"క" సినిమా చూడండి. మిమ్మల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీస్ ఆఫీసర్, డాక్టర్ మధ్య ప్రేమకథతో శ్రీమురళి, రుక్మిణి వసంత్ ల బఘీర