Amma Rajasekhar, Amma Ragin Raj, Rohit, Esther Noronha
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న నిర్మాత ఆర్బీ చౌదరి, ఆయన సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ "తల" అనే కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "తల" చిత్రానికి ఎన్ వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ రోజు తల సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.
డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ - తల మూవీ టీజర్ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు ఈ తలా సినిమా అంతే ఇంపార్టెంట్. నేను నా కెరీర్ లో దేవుడిగా భావించేది ఆర్బీ చౌదరి గారిని. ఆయన నాకు డ్యాన్స్ మాస్టర్ గా ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఆయన సినిమాలతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆర్బీ చౌదరి గారి నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది. మా అబ్బాయిని వారి అబ్బాయిలా భావించి ఈ అవకాశం ఇచ్చారు. తల లాంటి డిఫరెంట్ స్టోరీని యాక్సెప్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నందుకు ఆర్బీ చౌదరి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే గ్రాండ్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్ కు మీ బ్లెస్సింగ్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు రోహిత్ మాట్లాడుతూ - తల మూవీలో నా క్యారెక్టర్ గురించి అమ్మ రాజశేఖర్ గారు చెప్పినప్పుడు బాగా నచ్చింది. నాకు కామెడీ ఇష్టం. ఇందులో కామెడీతో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. అమ్మ రాజశేఖర్ గారి సినిమాల్లో కామెడీ ఎంత కొత్తగా ఉంటుందో మీకు తెలుసు. తల మూవీలోనూ అలాంటి ఎంటర్ టైన్ మెంట్ చూస్తారు. ఈ సినిమాతో అమ్మ రాగిన్ రాజ్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఎస్తేర్ మాట్లాడుతూ - తల మూవీలో నటించడం ఒక మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను నటించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి రోల్ లో నన్ను తీసుకోవడమే సర్ ప్రైజ్ చేసింది. షూటింగ్ అంతా చాలా పాజిటివ్ వైబ్ తో సాగింది. సినిమా మంచి విజయం సాధిస్తుందని అప్పుడే అనిపించింది. మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేసేలా తల సినిమా ఉంటుంది. అన్నారు.
ఎడిటర్ శివ శర్వాణి మాట్లాడుతూ - సూపర్ గుడ్ బ్యానర్ లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమాకు ఫస్ట్ ఆడియెన్ ఎడిటర్ అంటారు. తల మూవీని నేను ఫస్ట్ ఆడియెన్ గా చూసినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యాను. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. అన్నారు.
హీరో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ - నేను హీరోగా మారినప్పటి నుంచే ప్రేక్షకులే నాకు అన్నీ అనుకున్నాను. వాళ్లు ఎలా ఉండాలని కోరుకుంటారో అలా ఉంటాను. నాన్న తల మూవీ కథ చెప్పినప్పుడు సినిమా, నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో నేను మనసులో ఊహించుకున్నాను. రోజూ నా క్యారెక్టర్ లోనే ఉండిపోయేవాడిని. తల సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయదల్చుకోలేదు. తప్పకుండా మీరంతా థ్రిల్ అయ్యేలా సినిమా ఉంటుంది. అన్నారు.
నటీనటులు - అమ్మ రాగిన్ రాజ్, రోహిత్, ఎస్తేర్ నొరొన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రావణ్, తదితరులు