కోలీవుడ్ సినిమాతో లావణ్య త్రిపాఠి కష్టాలు.. లండన్ వెళ్లే ముందు హ్యాండిచ్చింది..
కోలీవుడ్ సినిమాతో లావణ్య త్రిపాఠి కష్టాల్లో పడింది. నాగచైతన్య, తమన్నా జంటగా తెలుగులో విడుదలైన 100% లవ్ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ హీరోగా, లావణ్య త్రిపాఠి హ
కోలీవుడ్ సినిమాతో లావణ్య త్రిపాఠి కష్టాల్లో పడింది. నాగచైతన్య, తమన్నా జంటగా తెలుగులో విడుదలైన 100% లవ్ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో కొంతభాగం షూటింగ్‌ను లండన్‌లో జరపాలని నిశ్చయించిన సినీ యూనిట్‌కు లావణ్య త్రిపాఠి గట్టి షాక్ ఇచ్చింది.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాల ద్వారా మంచి పేరు కొట్టేసిన లావణ్య.. తమిళ సినిమా 100% కాదల్ రీమేక్ కోసం లండన్‌కు బయల్దేరే సమయానికి హ్యాండిచ్చింది. దీంతో దర్శకనిర్మాతలు కోపంతో ఊగిపోయారు.
ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో సినీ దర్శకుడు చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతారాహిత్యంతో నష్టపోయామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ గొడవతో లావణ్య త్రిపాఠి కష్టాలొచ్చాయి. ఈ సమస్య నుంచి లావణ్య ఎలా బయటపడుతుందో మరి..