Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చలపతిరావుకు ఏం పొయ్యేకాలమొచ్చింది.. రవికేమైంది.. అడ్డంగా బుక్కయ్యారు. చిప్పకూడు తప్పదా?

తెలుగు సినిమా యాంకరింగ్‌లో వికృత ధోరణులు ఎంత పరాకాష్టకు చేరుకున్నాయంటే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ రసాభాస అయింది. 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా' అనే డైలాగ్‌ను సినిమాలో పెట్టినందుకు దానిమీద పేలుతున్న కుళ్లు జోక్‌లకు ఆ చిత్ర నిర్మాత న

చలపతిరావుకు ఏం పొయ్యేకాలమొచ్చింది.. రవికేమైంది.. అడ్డంగా బుక్కయ్యారు. చిప్పకూడు తప్పదా?
హైదరాబాద్ , బుధవారం, 24 మే 2017 (05:24 IST)
తెలుగు సినిమా యాంకరింగ్‌లో వికృత ధోరణులు ఎంత పరాకాష్టకు చేరుకున్నాయంటే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ రసాభాస అయింది. 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా' అనే డైలాగ్‌ను సినిమాలో పెట్టినందుకు దానిమీద పేలుతున్న కుళ్లు జోక్‌లకు ఆ చిత్ర నిర్మాత నాగార్జున పరువే పోయింది. నిండుసభలో అంత మంది ముందర ఆ ప్రశ్నను ఒక లేడీ యాంకర్ అడిగితే చలపతి రావు వంటి సీనియర్ మోస్ట్ నటుడు తానేం మాట్లాడుతున్నాడో తెలీని మత్తులో దున్నపోతులాగా కామెంట్ చేయడం, దానికి యాంకర్ రవి సూపర్‌గా చెప్పారు సర్ అంటు సమర్థించడం ఇద్దరి నెత్తికి వచ్చింది. ఈ వ్యాఖ్యలపై మహిళలోకం ధ్వజమెత్తడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. 
 
మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యానించిన ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు, యాంకర్ రవిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన రారండోయ్‌ వేడుక  చూద్దాం సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మహిళలపై తీవ్ర అసభ్యకర పదజాలంతో వ్యాఖ్యానించిన నటుడు చలపతిరావు, ఆయన వ్యాఖ్యలను బలపరుస్తూ హేళన చేసిన టెలివిజన్ ప్రముఖ యాంకర్ రవిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బండ్లగూడకి చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనా కుమారి సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సరూర్ నగర్ పోలీసులు ఐపీసీ 354 ఏ (IV), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 
అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్‌లో ముందు వరుసలో కూర్చున్న చలపతినుద్దేశించి 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా' అని యాంకర్‌  ప్రశ్నించినపుడు చలపతి ఇచ్చిన సమాధానంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయిన విషయం తెలిసిందే. ఈ సీనియర్‌ నటుడి వల్గర్‌ కామెంట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఇలాంటి డైలాగులను సినిమాలో ఎలా పెడతారంటూ మొదటిసారిగా నెటిజన్లు చిత్ర నిర్మాత నాగార్జునపై ధ్వజమెత్తటంతో చిన్నూబోయి స్త్రీలను అగౌరవ పర్చడం మా సంప్రదాయం కాదని సంజాయిషీ చెప్పుకోవలసి వచ్చింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి అద్బుత విజయంపై ఇప్పటికీ దిమ్మదిరుగుతూనే ఉన్న బాలీవుడ్.. 1500 కోట్లు లెక్కే కాదంటున్న అనిల్ శర్మ