Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమె డ్యాన్స్‌ చూస్తే ప్రేక్షకులు మైమరచిపోతారు.. ఎవరా హీరోయిన్...

సిల్క్‌స్మిత.. తెలుగు సినీ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. తన నటన, హావభావాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసిన స్మిత సెప్టెంబరు 23, 1996లో ఆత్మహత్య చేసుకుని సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస

ఆమె డ్యాన్స్‌ చూస్తే ప్రేక్షకులు మైమరచిపోతారు.. ఎవరా హీరోయిన్...
, శనివారం, 24 సెప్టెంబరు 2016 (09:30 IST)
సిల్క్‌స్మిత.. తెలుగు సినీ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. తన నటన, హావభావాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసిన స్మిత సెప్టెంబరు 23, 1996లో ఆత్మహత్య చేసుకుని సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నతనంలోనే దక్షిణాది సినీపరిశ్రమలో పేరు తెచ్చుకున్న సిల్క్‌స్మిత అసలు పేరు విజయలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దెందులూరు మండలం కొవ్వలి ఆమె పుట్టిన ఊరు. 15వ యేటే ఆమె సినిమా రంగంపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్ళింది. 
 
తొలిసారిగా 1978లో బేడీ అనే ఓ కన్నడ చిత్రంలో కనిపించినప్పటికీ నా దేశం సినిమాలో తెలుగు తెరపై తళుక్కుమంది. అయితే 1979లో ఇలైతేదీ అనే మళయాళ చిత్రంలో నటించగా అదే యేడాది తమిళంలో నటించిన వండిచక్రం అనే సినిమాలో ఆమె పేరు సిల్క్‌స్మితగా మారింది. ఆమె అందులో ప్రదర్శించిన నటనకు వరుస అవకాశాలు రావడానికి మార్గం ఏర్పడింది. ఇలా ఆమె పలు సినిమాల్లో పాత్రలు నటిస్తూ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంది. 
 
తన నటనతో కుర్రకారుని మత్తెక్కించే అందాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమలో తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. ఐటెం పాటలకు కొత్త ఒరవడిని ఆపాదించింది. బావలు సయ్యా.. మరదలు సయ్యా.. అన్న పాట వింటే ఎవరికైనా సరే సిల్క్‌స్మిత కళ్ళముందు డ్యాన్స్‌ వేసినట్టే ఉంటుంది. ఆమె పేరు వింటేనే ప్రేక్షకుల మదిలో మెరుపు... ఆమె డ్యాన్స్‌ చూస్తే జనం మైమరచిపోతారు... చిన్న వయసులోనే వెండితెరపై కాలుపెట్టి ఎన్నో చిత్రాలలో నటించింది. 
 
ప్రేక్షక జనాలకు మరదలు పిల్లగా దగ్గరైంది. నటిగా మంచి స్థితిలో ఉన్న సమయంలోనే ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది.  అప్పట్లో ఆమె లేని సినిమాను అభిమానులు ఊహించలేకపోయేవారు. తన సినీ ప్రస్థానం తారస్థాయిలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుని అందరికీ షాకిచ్చింది. చనిపోయే ముందు ఏడాది ఆమె సినీ నిర్మాతగా మారేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఆర్థిక కారణాలు, ప్రేమ వైఫల్యం, అతిగా మద్యం సేవించి మానసిక సమతుల్యతను కోల్పోవడం వంటి కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానించారు. 
 
కానీ ఆమె ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియక పోవడంతో సిల్క్‌స్మిత మృతి ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. వెండితెరకు ఆమె దూరమై రెండు దశాబ్దాలు అయినా అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరిచిపోలేదు. ప్రతీ సంవత్సరం ఆమె వర్ధంతి రోజున నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. పోస్టర్లు వేయించి ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ వానలు : 'ఓ వాన దేవా! శాంతించు' అన్నట్లుగా దండంపెడుతున్న నాగార్జున