నాగశౌర్య, షామిలీల ''అమ్మమ్మగారి ఇల్లు'' ట్రైలర్ మీ కోసం...
''కణం'' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో నాగశౌర్య నటించే తాజాగా సినిమా ''అమ్మమ్మగారి ఇల్లు''. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ సినిమాలో బాలనటి కమ్ కథానాయిక షామిలి హీరోయిన్‌గా నటిస్తోంది. సీని
''కణం'' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో నాగశౌర్య నటించే తాజాగా సినిమా ''అమ్మమ్మగారి ఇల్లు''. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ సినిమాలో బాలనటి కమ్ కథానాయిక షామిలి హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటీమణి సుమిత్రా ఈ సినిమాలో నాగశౌర్యకు అమ్మమ్మగా నటించారు. సుందర్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
కల్యాణ్ రమణ ఈ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఛలో తరహాలో హిట్ అవుతుందని సినీ పండితులు, ట్రైలర్ చూసిన నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హీరో నాగశౌర్యకు ఇది 15వ సినిమా. మరోవైపు నాగశౌర్య నటించే నర్తనశాల ఫస్ట్ లుక్ పోస్టర్లు సామాజిక మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ''అమ్మమ్మగారి ఇల్లు'' ట్రైలర్ ఎలా వుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.