రాజావారు రాణిగారు విజయం తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న ఎస్.ఆర్. కళ్యాణమండపం ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత కొంచెం విరామం ఇచ్చి 'సెబాస్టియన్ పిసి524'తో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు కిరణ్ అబ్బవరం రానున్నారు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా సెబాస్టియన్ పిసి524. ప్రమోద్, రాజు నిర్మించారు. ఇందులో నమ్రతా దరేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లు. నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) నేపథ్యంలో సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హీరో కిరణ్ అబ్బవరానికి తొలి తమిళ చిత్రమిది. ఈరోజు (జూలై 15) హీరో పుట్టినరోజు సందర్భంగా బర్త్-డే లుక్ విడుదల చేశారు.
నిర్మాతలు ప్రమోద్, రాజు మాట్లాడుతూ "కిరణ్ సబ్బవరం పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బర్త్-డే లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఆల్రెడీ క్రిస్మస్ కి విడుదలైన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' విడుదలైన తర్వాత మా సినిమాను విడుదల చేస్తాం. పక్కా కమర్షియల్ సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో తీశాం" అని చెప్పారు.
బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ "పోలీస్ సెబా పాత్రలో కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు. రేచీకటి కల వ్యక్తిగా నటించడం అంత సులువు కాదు. కిరణ్ చాలా బాగా చేశారు. నటుడిగా గత చిత్రాలతో పోలిస్తే వ్యత్యాసం చూపించాడు. జిబ్రాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాటలతో పాటు నేపథ్య సంగీతం అద్భుతంగా చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది" అని అన్నారు.
కిరణ్ అబ్బవరం పుట్టినరోజు (జూలై 15) సందర్భంగా ఒక రోజు ముందే, బుధవారం నాడు 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' రిలీజ్ టీజర్ విడుదల చేశారు. 'సెబాస్టియన్ పిసి524' బర్త్-డే లుక్ విడుదల చేశారు. అలాగే, 'సమ్మతమే' ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు విడుదలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో ఆయన కుమార్తె కోడి దివ్యాదీప్తి నిర్మిస్తున్న సినిమాను ఈరోజు ప్రకటించారు. దీనికి మణిశర్మ సంగీత దర్శకుడు, కార్తీక్ శంకర్ దర్శకుడు. హీరోగా కిరణ్ అబ్బవరం ఐదో చిత్రమిది.
'సెబాస్టియన్ పిసి524' చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) & యువరాజ్ (తమిళ్),, డిజిటల్ పార్ట్‌నర్: టికెట్ ఫ్యాక్టరీ, ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి, కళ: కిరణ్, కూర్పు: విప్లవ్ న్యసదాం, సహ నిర్మాత: సిద్ధారెడ్డి .బి, కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి, నిర్మాతలు: ప్రమోద్ - రాజు.