Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాతకర్ణి-2 తీయాలంటే క్రిష్‌కి అవి అడ్డమట

చారిత్రక కథతో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి ఎంత ప్రాచుర్యం సాధించిందంటే అప్పుడే దాని రెండో భాగం గురించి కూడా అటు బాలయ్య, ఇటు క్రిష్ ఆలోచిస్తున్నారని సమాచారం. శాతకర్ణి రెండో భాగం ఎప్పుడు అని అడిగితే భవిష్యత్తులో దీని గురించి ఆలోచిస్

Advertiesment
శాతకర్ణి-2 తీయాలంటే క్రిష్‌కి అవి అడ్డమట
హైదరాబాద్ , మంగళవారం, 17 జనవరి 2017 (05:41 IST)
దర్శకుడు క్రిష్‌కు ఇప్పుడు ఆడింది పాట పాడింది పాటగా మారింది. ఇన్నాళ్లుగా చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ సందేశాత్మక చిత్రాలకు పట్టం గట్టిన క్రిష్ ఒక్కసారిగా స్టార్ దర్శకుడయ్యాడు. గౌతమీపుత్ర శాతకర్ణి బాలకృష్ణ స్టామినాను కొత్త ఎత్తులకు తీసుకెళితే, క్రిష్‌కు అది స్టార్ దర్శకుడిగా జీవం పోసింది. భారీ ప్రాజెక్టుతో, స్టార్ హీరోతో, అతి తక్కువ సమయంలో  కనీవినీ ఎరుగని సెట్టింగులతో బాహుబలికి దీటైన సినిమాగా శాతకర్ణిని శిల్పంగా మలిచాడు క్రిష్. ఒక్క సినిమాతో బాలివుడ్ గుమ్మంలో పోయి పడ్డాడు క్రిష్. 
 
చారిత్రక కథతో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి ఎంత ప్రాచుర్యం సాధించిందంటే అప్పుడే దాని రెండో భాగం గురించి కూడా అటు బాలయ్య, ఇటు క్రిష్ ఆలోచిస్తున్నారని సమాచారం. శాతకర్ణి రెండో భాగం ఎప్పుడు అని అడిగితే భవిష్యత్తులో దీని గురించి ఆలోచిస్తానని క్రిష్ తప్పించుకున్నాడు. ఇప్పటికిప్పుడు సీక్వెల్ తీయాలనే ప్లాన్ క్రిష్‌కు లేనట్లే కనబడుతోంది. దానికి కారణం కూడా ఉంది మరి.
 
క్రిష్‌ చేతిలో ఇప్పుడు ఇద్దరు బడా హీరోలున్నారు. ఒకరు అక్షయ్ కుమార్, మరొకరు వెంకటేష్, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో రాజమాత పాత్రలో  బాలయ్య తల్లిగా నటించేందుకు హేమమాలిని అప్పాయింట్‌మెంట్ ఇవ్వడంలో సహాయపడింది హిందీ హీరో అక్షయ్ కుమార్. మొదట్లో హేమమాలిని క్రిష్‌తో మాట్లాడడానికే వ్యతిరేకించారట. కాని అక్షయ్ కుమార్, వెంకయ్య నాయుడు క్రిష్ ప్రతిభ గురించి వివరించాకనే హేమమాలిని శాతకర్ణిలో నటించడానికి అంగీకరించారట. 
 
అక్షయ్ కుమార్ ఇప్పటికే హిందీలో తన సినిమాకు దర్శకత్వం వహించవలిసిందిగా క్రిష్‌ను కోరినట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికే తెలుగు హీరో వెంకటేష్‌తో చిత్రం తీసేందుకు క్రిష్ కమిట్ అయిపోయాడు కాబట్టి మరో సంవత్సరం వరకు శాతకర్ణి 2  గురించి మర్చిపోవలసిందేనని అభిజ్ఞవర్గాల భోగట్టా.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమ్మ అమ్మాయినే నేనెందుకు పెళ్లాడాలి? అంటే..!