శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "లీడర్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్నారై భామ ప్రియా ఆనంద్. తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. "రామరామ కృష్ణకృష్ణ"లో నటించింది. అయితే ఇప్పుడిప్పుడే ఎదిగే నటీమణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతోంది.
గ్లామర్ పాత్రలు చేయాల్సి వస్తే తప్పదనీ, అయితే తాను బికినీ వేస్తే చూడ్డానికి బాగోనని మంచి సంప్రదాయ పాత్రల్లో సరిపోతానని అంటోంది. భవిష్యత్‌లో దర్శకత్వం వహిస్తానంటోంది. చిన్నప్పటి నుంచీ మోడలింగ్ అంటే తనకు ఇష్టమని, ఆ మోడలింగ్ రంగం నుంచే సినిమాల్లోకొచ్చాననీ, నటనకన్నా టెక్నికల్ అంశాలపై తనకు ఆసక్తి ఎక్కువని అంటోంది ప్రియా ఆనంద్.
నటిగా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాక డైరెక్షన్ గురించి ఆలోచిస్తానని, తన సినిమాల్లో కాస్ట్యూమ్స్ విషయమై ప్రత్యేకమైన దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది. హారర్ చిత్రాలంటే భయమని, గ్లామరస్ పాత్రలూ, బబ్లీగా కనిపించే పాత్రలు ఇష్టమని చెపుతోంది.