"దబాంగ్" తమిళ రీమేక్ "ఒస్తి" హీరో శింబు ఈ మధ్య తెగ హుషారుగా కనిపిస్తున్నాడట. స్నేహితులతోనే కాదు షూటింగ్ స్పాట్‌లో కూడా ఈ యంగ్ హీరో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడట. ఇందుకు కారణం ఏమిటని ఆరా తీస్తే.. మాజీ ప్రియురాలు నయనతార తన లవర్ ప్రభుదేవాకు దూరం కావడమేనని సమాచారం. ఎప్పటికైనా తన ప్రియురాలు తన వద్దకే తిరిగి వచ్చేస్తుందన్న నమ్మకంతో ఉన్న శింబు.. "చూశారా నేను అనుకున్నట్లే జరిగిందని" ఫ్రెండ్స్‌తో అంటున్నాడట.
శ్రీరామరాజ్యం చిత్రంతో సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేస్తుందనుకున్న నయనతార ఉన్నట్టుండి మళ్లీ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాదు.. తన సినీ కెరీర్‌ను డెవలప్ చేసుకోవాలని నయన భావిస్తోంది. ఇంకా ప్రభుదేవాకు దూరమైన నయనతార.. తెలుగులో రెండు సినిమాల్లో నటించేందుకు సై అంది.
ఈ నేపథ్యంలో శింబు తన మాజీ లవర్ నయనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని కోడంబాక్కం వర్గాల సమాచారం. మరోవైపు ప్రభుదేవా కూడా నయనను ఎలాగైనా బుజ్జగించి.. తనవైపు లాక్కోవాలని చూస్తున్నాడట. మరి నయనతార మార్గమెటో తెలుసుకోవాలంటే.. చాలాకాలం వెయిట్ చేయాల్సిందే..!