Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిరిడీసాయి చిత్రంలో విధవగా కమలినీముఖర్జీ!

Advertiesment
శిరిడీసాయి చిత్రంలో విధవగా కమలినీముఖర్జీ!
, శుక్రవారం, 9 మార్చి 2012 (10:41 IST)
హీరోయిన్లు అక్కలుగానో, చెల్లెలుగానో, లేదా వ్యాంప్‌ పాత్రలకు చేయడం పరిపాటి. కానీ కమలినీముఖర్జీ మాత్రం శిరిడీసాయి అనే చిత్రంలో విధవగా నటిస్తోందని తెలిసింది. అక్కినేని నాగార్జున టైటిల్‌పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కులుమనాలిలో శరవేగంగా జరుగుతోంది.

దానికిముందు షిరీడీ పరిసర ప్రాంతాల్లో తెల్లటి వస్త్రాలు ధరించగా బాబాను స్తుతించే సన్నివేశాలు చిత్రించారు. మరి ఆ పాత్ర పేరు ఏమిటో... బయటకు రాలేదు. సాయికి భక్తురాలిగా నటించిన ఆమె ఈ చిత్రంలోని పాత్ర తనకు మంచి పేరు తెస్తుందని భావిస్తోంది.

రాఘవేంద్రరావు వంటి దర్శకునితో నటించడం ప్రత్యేకతగా చెప్పుకుంటోంది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం షూటింగ్‌ చేస్తున్నారు. ఈనెల 27 నుంచి హైదరాబాద్‌లోని ఏడెకరాల స్థలంలో ఓ భారీసెట్‌ వేసి అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రించనున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu