తన ఆరోగ్య రహస్యాలతో పాటు.. పాటించే చిట్కాలను సైతం విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడు, యువహీరో మంచు విష్ణువర్ధన్ బాబుకు విడమరిచి చెప్పానని నాజుకు నడుం చిన్నది ఇలియానా అంటోంది. "సలీమ్" చిత్రం షూటింగ్‌లో తామిద్దరం మరింతగా దగ్గరయ్యామని చెపుతోంది. ఇంతకీ ఏ విధంగా దగ్గరయ్యారో చెప్పమంటే మాత్రం కస్సుమంటోంది. ఈ చిత్రం షూటింగ్ యేడాది కాలంగా సాగుతున్న విషయం తెల్సిందే.
అయితే, ఇటీవల ఇలియానా తన మనస్సులోని కొన్ని విషయాలను బయటపెట్టింది. ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల లాభమేమిటనీ మొదట్లో అనుకునేదాన్ని. అలాగే, గ్రీన్ టీ తాగడం వల్లే ఏంటబ్బా ఉపయోగం అనే ఆలోచన వచ్చేది. అయితే, ఈ రెండు పనులు చేస్తే ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా తెలిసిందన్నారు.
ఉదయాన్నే నిద్రలేవగానే పక్షుల కిలకిలరావాలు, బేర్ ఫ్రూట్స్‌తో పచ్చటి గడ్డిమీద వాకింగ్ చేయడం, యోగా చేయడం వంటివి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెపుతోంది. అందుకే "సలీమ్" చిత్రంలో ఏమాత్రం చిన్నపాటి విరామం లభించినా వెంటనే గ్రీన్ టీ తయారు చేయించుకుని సేవించేదానని చెపుతోంది. దీనివల్ల లాభ నష్టాలను హీరో విష్ణుకు చెప్పేదానినని, దీంతో ఆయన కూడా తన బాటలో నడుస్తున్నారని ఇలియానా చెపుతోంది.