"గబ్బర్‌సింగ్" భామ శృతిహాసన్ ముంబైకి మకాం మార్చింది. ఐరన్ లెగ్‌గా ఒకప్పుడు పేరుతెచ్చుకున్న ఈ జున్నులాంటి అమ్మాయి శృతిహాసన్.. గబ్బర్‌సింగ్ హిట్‌తో గోల్డెన్‌లెగ్‌గా మారిపోయింది. గబ్బర్‌సింగ్‌లో కత్తిలాంటి అమ్మాయిగా ప్రేక్షకులను అలరించిన శృతిహాసన్.. తాజాగా ముంబైలో సొంతింటిని ఏర్పాటు చేసుకోనుంది.
ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో 2బీపెచ్‌కే అపార్ట్‌మెంట్‌కు త్వరలో శృతిహాసన్ షిఫ్ట్ కానుంది. బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు రావడంతో పాటు తన తల్లి సారిక, సోదరి అక్షరకు దగ్గర కావాలని శృతిహాసన్ భావిస్తోంది.
దీనిపై శృతిహాసన్ మాట్లాడుతూ.. ముంబైలో ఇండిపెండెంట్ హౌస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నా. ముంబైతో తనకు మంచి సంబంధాలున్నాయ్. నా అమ్మ, సోదరి ఇక్కడే ఉన్నారు. అందుకే ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నా. అంతేకాదు.. బాంద్రాలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్‌కు వెళ్లేందుకు వీలుగా త్వరలో ముంబైకి మకాం మార్చనున్నట్లు శృతిహాసన్ చెప్పుకొచ్చింది.