Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బికినీలు వేయమంటే వేస్తాను: సింధు మీనన్

Advertiesment
సింధు మీనన్
భద్రాచలంలో హీరోయిన్‌గా పరిచయమైన బాలనటి సింధు మీనన్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంత పేరు రాలేదు. చందమామతో తళుక్కుమంది. అయినా ఆ తర్వాత పెద్దగా పిలిచినవారు లేరు. అదేమంటే... తమిళంలో, మలయాళంలో తనకు బోలెడు ఛాన్సులున్నాయని ఊకదంపుడు కబుర్లు చెపుతోంది. 

ఇక మన టాలీవుడ్‌లో మాత్రం లేటెస్ట్‌గా సుభద్ర చిత్రంలో నటిస్తోంది. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు ఏవిధంగా ఉంటాయి? అపోహలు వస్తే ఎలా మారుతాయి? అనే పాయింటుతో రూపొందుతోంది. ఈ సందర్భంగా ఆమెను పలుకరిస్తే.. పలు విషయాలు వెల్లడించింది.

లవ్ గురించి చెబుతూ... పనీపాటలేనివాళ్లు చేసే పనిదని చెప్పింది. తనకు అస్సలు ప్రేమించే తీరికే లేదని అంటోంది. మనిషికి ఏదైనా పనుంటే దానిమీద శ్రద్ధపెట్టి కెరీర్ డెవలప్ చేసుకుంటారనీ, అది లేనివారు ప్రేమ అంటూ పిచ్చిపట్టినట్లు తిరుగుతుంటారని చెపుతోంది.

ఎక్స్‌పోజింగ్ గురించి ప్రస్తావిస్తూ... "ఎంత చేయమంటే అంత చేసేందుకు నేను రెడీ. పాత్ర డిమాండ్ మేరకు ఎంత చేయమన్నా చేస్తాను. ఆఖరికి బికినీ వేసుకుని నటించమని అడిగినా నటించేందుకు నాకు అభ్యంతరం లేదు" అని స్పష్టంగా చెప్పింది సింధు. మరి ఈ విషయం చేరాల్సినవారికి చేరిందో లేదో!!

Share this Story:

Follow Webdunia telugu