Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫెర్రారీ కి సవారీ'లో ఐటమ్ సాంగ్ చేయనున్న విద్యాబాలన్!

Advertiesment
ఫెర్రారీ కి సవారీ'లో ఐటమ్ సాంగ్ చేయనున్న విద్యాబాలన్!
, బుధవారం, 7 మార్చి 2012 (13:23 IST)
ఏక్తాకపూర్ నిర్మించిన "ద డర్టీ పిక్చర్‌"లో అందాలను ఆరబోసి ప్రపంచ వ్యాప్తంగా గ్లామర్ హీరోయిన్ అనిపించుకున్న బాలీవుడ్ యాక్టర్ విద్యా బాలన్.. ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో ఫెర్రారీ కీ సవారీ అనే చిత్రంలో విద్యాబాలన్ ఐటమ్ గర్ల్‌గా కనిపించబోతుంది. 

'మాల జావో ది..' అనే పాటకు విద్యాబాలన్ స్టెప్పులు వేయనుంది. ఈ పాటలో విద్యాబాలన్ మహారాష్ట్ర చీరకట్టులో మాస్‌ను ఆకట్టుకోనుంది. మూడు వారాల పాటు ఫెరారీ కి సవారీ అనే చిత్రంలోని ఐటమ్ సాంగ్ రిహార్సెల్‌లో విద్యాబాలన్ పాల్గొంటుంది.

కొల్హాపూర్ ప్రాంతంలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ పాటలో విద్యాబాలన్ లవానీ కలర్ చీరలో కనిపిస్తుందని నిర్మాత విదు వినోద్ చోప్రా, దర్శకుడు రాజేష్ మపుస్కర్‌లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu