తెలుగులో "పోకిరి" ఛాన్స్ మిస్ అయిన కంగనా చాలాకాలం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "ఏక్ నిరంజన్"లో నటిస్తోంది. ప్రభాస్ చాలా మంచి నటుడని ఆయనలో హాస్య చతురత చాలా ఉందని కితాబిస్తోంది. అన్నిటికీ మించి ప్రభాస్ మనసున్న మనిషి అని అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది.
ప్రభాస్ డాన్సులు బాగా చేస్తాడని అంటోంది. తన డ్రీమ్ రోల్స్ గురించి చెపుతూ... "ఇంకా నాకు 22 ఏళ్లే. చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. ఫలానా అని చెప్పడం దేనికి. దర్శకుడు చెప్పే పాత్రలు వేయడం నా పని" అంటోంది. రేపటి గురించి ఆలోచించి ఉన్నది వదులుకోవడం ఇష్టం ఉండదని చెపుతోంది.
కంగనా రనౌత్‌కు జనరల్ నాలెడ్జ్, జీవితంపై అవగాహన ఎక్కువలా కనిపించటం లేదూ... లేకపోతే ఇంత చిన్న వయసులో అంత "ముదురు" ఆలోచనలు ఎలా వస్తాయీ...?