తనకంటే పొట్టిగా ఉండే వ్యక్తిని వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని యోగాటీచర్, బిల్లా సెక్సీడాళ్ అనుష్క అంటోంది.
కానీ.. పెళ్లితోనే పరిచయమయ్యే వ్యక్తి తన కంటే ఎత్తు తక్కువైతే మాత్రం ఒప్పుకోనని అంటోంది.
అయితే పెళ్లికి ముందే పరిచయమైన వ్యక్తిగా ఉంటే మాత్రం పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తానని ఈ పొడవుకాళ్ల సుందరి స్పష్టం చేసింది.
టాలీవుడ్ కథానాయికల్లో.. ఇతరులను ఇట్టే ఆకట్టు అందచందాలతో ఖచ్చితమైన ఎత్తుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న అనుష్కకు ఈ మధ్య హైట్ ఓ సమస్యగా మారిందట. ఏ హీరో పక్కన ఆమెను నిలబెట్టినా కథానాయకులే పొట్టిగా కనిపిస్తున్నారట.
తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ సరసన "వేట్టైక్కారన్" సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ హీరో చెంతన కూడా అనుష్కనే ఎత్తుగా కన్పిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలో.. పెళ్లి చేసుకునే వ్యక్తి మీ కంటే పొట్టిగా ఉంటే చేసుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అనుష్క పైవిధంగా చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటిస్తోన్న అనుష్క.. తాను బాగా అభిమానించే కథానాయకుల్లో మహేష్‌బాబు ఒకరని చెబుతోంది. అంతేకాదు.. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని అనుష్క కితాబిస్తోంది.