Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెల్లపిల్ల తమన్నాతో మళ్లీ జతకట్టనున్న వరుణ్ సందేశ్!

Advertiesment
తమన్నా
WD
శేఖర్‌కమ్ముల "హ్యాపీడేస్" ద్వారా జంట అదిరిందని ప్రేక్షకుల మార్కులు కొట్టేసిన వరుణ్ సందేశ్, తమన్నాలు మళ్లీ కలిసి నటించనున్నారట. హ్యాపీడేస్‌లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అంతేకాదు.. తమన్నానే తనకు సరైన జోడీ అని వరుణ్ సందేశే.. ఇటీవల విడుదలైన "ఎవరైనా.. ఎప్పుడైనా" సినిమా రిలీజ్ తర్వాత చెప్పాడని అతని సన్నిహితులు అంటున్నారు.

దీంతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన హవాను కొనసాగిస్తోన్న తెల్లపిల్ల తమన్నాతో జతకట్టేందుకు మళ్లీ ఎంతో ఉత్సాహంగా వరుణ్ సిద్ధమవుతున్నాడని తెలిసింది.

ప్రేమకథా నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న వరుణ్, తమన్నాల నూతన చిత్రానికి, ప్రముఖ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆర్య-2లో బిజీబిజీగా ఉన్న సుకుమార్, ఆ చిత్రం పూర్తవ్వగానే వరుణ్, తమన్నాల కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిసింది.

ఇకపోతే.. "హ్యాపీడేస్" సినిమాలో తమన్నా ప్రేమించకముందే.. ముద్దడిగిన వరుణ్ సందేశ్.. ఆమెను నిజజీవితంలో వివాహం చేసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. మరి తమన్నా కలిసి నటించబోయే తదుపరి సినిమా వీరిద్దరి మంచి బ్రేక్ సంపాదించిపెడుతుందా? లేదా? అనే విషయం తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే..!.

Share this Story:

Follow Webdunia telugu