Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గీతా ఆర్ట్స్ మల్టీస్టారర్ చిత్రంలో రామ్ చరణ్-అల్లు అర్జున్

Advertiesment
రామ్ చరణ్
, గురువారం, 29 అక్టోబరు 2009 (13:46 IST)
File
FILE
క్రేజీ యువ హీరోలు ఇద్దరితో కలిపి గీతా ఆర్ట్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే... రామ్ చరణ్-అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయేలా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ తేజ్ నటించిన "మగధీర" చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తయారైంది. ఇది ఇచ్చిన సక్సెస్‌తో యువ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు.

ప్రస్తుతం 'మగధీర' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే పనుల్లో నిమగ్నమైవున్నారు. ఇందులో హృతిక్ రోషన్ లేదా అమీర్ ఖాన్‌లలో ఎవరో ఒకరు హీరోగా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత హీరో పవన్ కళ్యాణ్‌తో వివి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 2010లో ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత సినీ ప్రేమికులు, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచే స్థాయిలో వీరిద్దరితో కలిపి మరో చిత్రాన్ని నిర్మించతలపెట్టారు. ఇందుకోసం అవసరమైన బలమైన కథ కోసం నిర్మాత పలువురు కథా రచయితలను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

2011లో సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రం తెలుగు వెండితెర చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా నిర్మించాలని భావిస్తున్నారు. అలాంటి కథ కోసం నిర్మాత అన్వేషణ సాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu