Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాజల్ అగర్వాల్‌పై మనస్సు పారేసుకున్న రామ్ చరణ్

Advertiesment
కాజల్ అగర్వాల్
, గురువారం, 29 అక్టోబరు 2009 (13:48 IST)
File
FILE
"మగధీర" చిత్ర ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ చిత్ర హీరో, జూనియర్ మెగాస్టార్ రామ్‌చరణ్‌ ఈ అమ్మడుపై మనస్సు పారేసుకున్నాడట. 'మగధీర' సినిమాలో తన ప్రేమను దక్కించుకునేందుకు పూర్వజన్మలో ప్రాణత్యాగం కూడా చేస్తాడు. ఈ ప్రేమే నిజ జీవితంలోనూ కాజల్‌పై చూపిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

అందుకే.. తన తదుపరి చిత్రం "ఆరంజ్‌"లో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయాలని దర్శకుడుకి చరణ్ చూసించినట్టు సమాచారం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు వచ్చే నెల 21వ తేదీన జరుగనున్నాయి. డిసెంబరు మొదటి వారం నుంచి విదేశాల్లో షూటింగ్ రెగ్యులర్ జరుపుకోనుంది.

ఈ చిత్రం కథా పరంగా ఇందులో ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒక హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయాలని చరణ్ కోరారట. రెండో హీరోయిన్‌గా జెనీలియాను ఎంపిక చేశారు. ఈ పాత్ర చాలా తక్కువగా ఉండటం వల్ల ఆమె నిరాకరించినట్టు సమాచారం.

దీంతో రామ్ చరణ్ తలదూర్చి రెండో హీరోయిన్ పాత్ర నిడివి పెంచాలని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ను కోరారు. కాగా, ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై చిరంజీవి సోదరుడు కె.నాగబాబు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu