Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ యాంగిల్‌లో సెక్సీగా ఉండనో చెప్పండి: నమిత

Advertiesment
ఏ యాంగిల్‌లో సెక్సీగా ఉండనో చెప్పండి: నమిత
, బుధవారం, 5 డిశెంబరు 2007 (11:59 IST)
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ చిత్రంలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసిన హీరోయిన్ నమిత. తమిళ, మళయాళ చిత్రాల్లో మంచి ఆఫర్‌లు రావడంతో అక్కడ బాగా బీజీ అయిన ఈ తార ఈ మధ్య తెలుగు తెరపై తిరిగి వచ్చేందుకు ఎదురు చూస్తున్నట్లు సినీ వర్గాల భోగట్టా.

ఈ మధ్యే ఓ మోడలింగ్ షో కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా నమితను చూసి ఆశ్చర్యపోయారంతా.. ఎందుకంటే కాస్త ఒళ్లు తగ్గించి నాజూగ్గా కనపడింది. ఏంటా అని ఆరా తీస్తేనేమో... నేను ఏ యాంగిల్‌లో సెక్సీగా కనిపించనో చెప్పండి... అంది. ఎంత లావెక్కినా నా ఫేసే నాకు ప్లస్ పాయంట్ అని వయ్యారం ఒలకబోస్తూ చెబుతోంది.

అంతే కాదండోయ్ ఏదేనా మన చేతుల్లోనే ఉందంటూ వేదాంతం మాట్లాడేస్తోంది. ఏంటా అని తరచి చూస్తే ఈ తతంగమంతా డిసెంబర్ 31న చెన్నైలో జరిగే ఓ షోకు ఈమె నాజూగ్గా తయారవుతోందని గుసగుసలాడుతున్నారు. ఈ షోను నిర్వహించే ఈవెంట మేనేజ్‌మెంట్ కంపెనీ ఇందులో పాల్గొనేందుకు 15లక్షల ఆఫర్ ఇస్తోందని అందరూ తెగ మాట్లాడేసుకుంటారు.

ఏది ఏమైనప్పటికీ... జెమినీ చిత్రంలో నమిత బాడీ కొలతలు 36-28-34 నాలుగుగా ఉండేది.. కాని ఆ చిత్రం తర్వాత 38-32-36కు చేరింది. ఇప్పుడు తాజాగా ఆమె నాజూగ్గా కనబడే సరికి దర్శకనిర్మాతలు ఆమె వెంటపడుతున్నారు. ఏమంటే ఆమె ఫేస్‌లో అందం మాత్రం తగ్గలేదుట...

Share this Story:

Follow Webdunia telugu