Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎలుగుబంట్ల కోసం నగ్నంగా వేడుకోలు

Advertiesment
ఎలుగుబంట్ల కోసం నగ్నంగా వేడుకోలు
, శుక్రవారం, 5 జూన్ 2009 (12:04 IST)
ప్రముఖ ఆస్ట్రేలియా నటి మిరాండా కేర్ తొలిసారిగా నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. అదికూడా ఎలుగుబంట్లకోసమట. టెడ్డిబేర్‌లా కనపడే ఈ ఎలుగుబంట్ల సంఖ్య నానాటికీ ప్రపంచంలో తగ్గిపోతోంది. వీటిని కాపాడాలనే ఆలోచనలతోనే మిరాండా వివస్త్రగా మారి ప్రపంచానికి సందేశమిచ్చేందుకు నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా ఫోటోలకు నగ్నంగా ఫోజులిచ్చి వాటిని కాపాడమని కోరింది.

పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన రోలింగ్ స్టోన్ పత్రిక ముఖ చిత్రంపై ఈవిడ ఫోటోను ప్రచురించారు. అదికూడా ఆమెను ఓ చెట్టుకు కట్టి ఉంచారు. దీనికి ముందు ఆమె వివస్త్రగా నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చేందుకు నిరాకరించింది.

ఆ తర్వాత పత్రికల వారితో మాట్లాడుతూ... ఆస్ట్రేలియాలో కేవలం 10 వేల ఎలుగుబంట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని వాటిని కాపాడాలనే ఉద్దేశంతోనే తాను మళ్ళీ నగ్నంగా నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. తన ఈ చిన్న ప్రయత్నంతో ఎలుగుబంట్లను కాపాడమని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... యూరోప్ దేశస్తులు ఆస్ట్రేలియాలోకి వచ్చిన తర్వాతే ఎలుగుబంట్ల సంఖ్య దాదాపు 80 శాతం మేరకు తగ్గిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వాటి పరిరక్షణే ధ్యేయంగా తాను ఈ ఫోటోలకు ఫోజులిచ్చేందుకు అంగీకరించానని ఆమె తెలిపారు. దీంతోనైనా ప్రజలు వన్యప్రాణులను కాపాడేందుకు ప్రయత్నిస్తారని తాను భావిస్తున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజమేకదా! వన్యప్రాణులు...మూగజీవులు. మనిషి తన స్వార్థం కోసం ప్రతి ప్రాణిని అంతమొందించేందుకు కూడా వెనుకాడటం లేదు. దీంతో వన్య ప్రాణులు అంతరించిపోతున్నాయి. వీటిని కాపాడుకుని పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరునికీ ఉంది. దీనిని గుర్తెరిగి మసలుకుంటే మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారదంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.

Share this Story:

Follow Webdunia telugu