"అదుర్స్"గా ఎన్టీఆర్, నయనతారల కొత్త చిత్రం!?
నందమూరి యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీకి టైటిల్ పరిశీలనలో ఉంది.సెక్సీతార నయనతార, షీలా జోడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అదుర్స్, లవకుశ, వాడేవీడు అనే మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. ఐతే ఇందులో "అదుర్స్"కు మంచి స్పందన వచ్చిందని, అభిమానులు, శ్రేయోభిలాషులు దీన్నీ ఖరారు చేయాలని ఫోన్లు చేస్తున్నారని సమాచారం. త్వరలో ఆడియో విడుదలలో టైటిల్ ప్రకటించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 18వ తేదీన ఎన్టీఆర్ కొత్త చిత్రం తెరకెక్కనుందని యూనిట్ వర్గాల సమాచారం. ఇకపోతే.. మస్కా షీలా, నయనతారల గ్లామర్, ఎన్టీఆర్ క్రేజ్‌తో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు. ఎన్టీఆర్‌తో ఆది, సాంబ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన వినాయక్ మూడో చిత్రంగా "అదుర్స్"ను భారీ బడ్జెట్ మూవీగా అద్భుతంగా రూపొందిస్తున్నారని తెలిసింది.అంతేకాదు.. తమిళ "బిల్లా"లో కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ సరసన నటిస్తూ.. బికినీలో దర్శనమిచ్చిన అందాల తార నయన, ఎన్టీఆర్ చిత్రంలోనూ కురుచ దుస్తులో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇంకా ఈ సినిమాలో నయనతార ఆరబోసే అందాలతో బొమ్మాళీ అనుష్క, త్రిష, ప్రియమణిలనే మించిపోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.