Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాన్ని అందంగా చూపితే ఎక్స్‌పోజింగ్ అంటారేం...?

Advertiesment
కంగనా రనౌత్
ఎక్స్‌పోజింగ్ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అంటూ నటి కంగనా రనౌత్ ప్రశ్నిస్తోంది. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? నిజమండీ బాబూ. బయట కొంతమంది అమ్మాయిలు ధరించే వేషధారణకన్నా తాము నటించే దుస్తులు ఫర్వాలేదని చెబుతోంది. అసలు అందాన్ని అందంగా చూపించడాన్ని ఎక్స్‌పోజింగ్ అని పేరు పెట్టడం సమంజసం కాదనీ అంటోంది. 

కులుమనాలిలో పుట్టిన ఈ భామ పూరీ జగన్నాథ్ "పోకిరి" ఛాన్స్ మిస్సయ్యానని బాధపడ్డా మళ్లీ ఆయన దర్శకత్వంలో "ఏక్ నిరంజన్" చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెబుతోంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా ఆమె కొన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతూ... "ఎన్నో వృత్తి ఉద్యోగాలు ఉన్నట్లే సినిమా కూడా ఓ వృత్తే. కాకపోతే డబ్బు ఎక్కువగా వచ్చే వృత్తి. దానికోసం ఏ పాత్ర ఇచ్చినా పరిధి మేరకు నటించాల్సిందే. లేదంటే.. ఈ రంగంలోకి రాకూడదని నా అభిప్రాయం.

మీరడిగినట్లు ఎక్స్‌పోజింగ్ అంటే.. నిర్మాతను అడగండి. తీసిన రీల్ ఎంత ఎక్స్‌పోజ్ అయిందో చెబుతారు" అంటూ నవ్వుతూ చమత్కారంగా మాట్లాడింది.

Share this Story:

Follow Webdunia telugu