Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ ట్రైలర్.. యూట్యూబ్‌లో ఫ్యాన్స్ బ్రహ్మరథం.. కబాలి పోస్టర్ ఎందుకంటే..?

టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్ ఎమ్‌.ఎస్‌.ధోనీ జీవితంపై వస్తున్న సినిమా ''ఎమ్‌.ఎస్‌. ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ''. ఈ సినిమా ట్రైలర్‌ ఈ నెల 11న రిలీజైంది. యూట్యూ‌బ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది ఈ ట్రైలర్.

ధోనీ ట్రైలర్.. యూట్యూబ్‌లో ఫ్యాన్స్ బ్రహ్మరథం.. కబాలి పోస్టర్ ఎందుకంటే..?
, మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (12:45 IST)
టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్ ఎమ్‌.ఎస్‌.ధోనీ జీవితంపై వస్తున్న సినిమా ''ఎమ్‌.ఎస్‌. ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ''. ఈ సినిమా ట్రైలర్‌ ఈ నెల 11న రిలీజైంది. యూట్యూ‌బ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది ఈ ట్రైలర్. ఇప్పటికే ఈ వీడియోని కోటి పదమూడు లక్షలు మంది చూశారు. సుషాంత్‌ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నీరజ్‌ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. 
 
బాలీవుడ్ పరిశ్రమలో ఇంత వరకూ ఏ సినిమా ట్రైలర్‌కు రానన్ని లైక్ లు.. వ్యూస్ ''ఎమ్‌.ఎస్‌. ధోనీ'' ట్రైలర్‌కు వచ్చాయంటూ.. హీరో సుషాంత్ తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు . ఈ సినిమాలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాణీ నటించారు. సెప్టెంబర్ ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
ఇప్పటికే రీల్‌ లైఫ్‌ ధోనీ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సినిమా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తమిళంలోనూ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించాలనుకుంటున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఐపీఎల్‌లో ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరపున ఆడాడు. 
 
కానీ కొన్ని కారణాల వల్ల ఈ జట్టును ఐపీఎల్‌ నుంచి నిషేధించారు. దాంతో స్వయంగా ధోనీనే తన సినిమా ప్రచార కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించాలనుకుంటున్నాడు. ఇందుకోసం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సాయం తీసుకోవాలనుకుంటున్నాడట. త్వరలో రజనీని ధోనీ కలిసి ఈ విషయం గురించి చర్చించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నారు. ధోనీకి రజనీకాంత్ అంటే ఎనలేని అభిమానం. దాంతో కబాలి సినిమాలోని రజనీ స్టైల్‌ని కాపీ కొడుతూ ధోనీ ఫొటో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మీకి దిమ్మ తిరిగిపోయింది.. ''చారుశీల''కు చేదు అనుభవం.. యూఎస్‌లో ఒక్క షోకే?