Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రవితేజ ఏమయ్యాడు...? అహ... ఏమయ్యాడూ అని...

హీరో రవితేజ నటుడిగా చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. సరైన కథలు దొరక్క.. బాడీని సరిగ్గా మౌల్డ్‌ చేయడంలో బిజీగా వున్నాడు. అయితే.. రవితేజ గ్యాప్‌ ఎందుకు తీసుకున్నాడంటూ.. ఫిలింనగర్‌లో కథనాలు ఆసక్తిగా సాగుతున్నాయి. ఈసారి కొడితే హిట్‌ కొట్టే కాన్సెప్ట్‌తో రావాలన

రవితేజ ఏమయ్యాడు...? అహ... ఏమయ్యాడూ అని...
, బుధవారం, 28 సెప్టెంబరు 2016 (16:54 IST)
హీరో రవితేజ నటుడిగా చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. సరైన కథలు దొరక్క.. బాడీని సరిగ్గా మౌల్డ్‌ చేయడంలో బిజీగా వున్నాడు. అయితే.. రవితేజ గ్యాప్‌ ఎందుకు తీసుకున్నాడంటూ.. ఫిలింనగర్‌లో కథనాలు ఆసక్తిగా సాగుతున్నాయి. ఈసారి కొడితే హిట్‌ కొట్టే కాన్సెప్ట్‌తో రావాలని ఒకరు అంటుంటే.. కాదుకాదు ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదని మరికొన్ని వార్తలు విన్పిస్తున్నాయి. 
 
కానీ.. రవితేజ కొత్త చిత్రాన్ని చేస్తున్నాడు. రెండు కొత్త సినిమాలకు కమిటయ్యారు. అందులో ఒకటి దర్శకుడు బాబీతో చేయనున్నాడు. కమర్షియల్‌ మాస్‌ ఎంటర్టైనర్‌‌గా ఉండబోతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 12న దసరాకు మొదలుపెట్టనున్నారు. రాశిఖన్నా హీరోయిన్‌‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని రామ్‌ తాళ్లూరి నిర్మించనున్నారు. రవితేజ మరో సినిమాని విక్రమ్‌ అనే కొత్త దర్శకుడితో చేయనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగచైతన్యకు ముగ్గురు హీరోయిన్లా...? అందుకే 'ప్రేమమ్‌'కు పిచ్చ క్రేజా...? వెంకీ, నాగ్ గెస్ట్ రోల్స్...