Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకటేష్‌తో క్రిష్ మూవీ అటకెక్కినట్లేనా?

గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక సినిమాను తీసి రికార్డులను బద్దలు కొట్టిన ప్రముఖ దర్శకుడు క్రిష్ సీనియర్ హీరో వెంకటేష్‌తో సినిమా తీస్తున్నట్లు తెగ వార్తలొచ్చేశాయి. నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం కూడా అయిన గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య సినీ జీవితంలోనే

Advertiesment
Krish rumoured
హైదరాబాద్ , గురువారం, 16 ఫిబ్రవరి 2017 (04:50 IST)
గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక సినిమాను తీసి రికార్డులను బద్దలు కొట్టిన ప్రముఖ దర్శకుడు క్రిష్ సీనియర్ హీరో వెంకటేష్‌తో సినిమా తీస్తున్నట్లు తెగ వార్తలొచ్చేశాయి. నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం కూడా అయిన గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య సినీ జీవితంలోనే అద్బుత విజయాన్ని సాధించిన మాట వాస్తవం. ఇప్పుడు అదే క్రిష్ దర్శకత్వంలో వెంకటేష్ 75వ సినిమా వస్తున్నట్లు బాగా ప్రచారమయింది. 
 
కానీ గౌతమీపుత్ర శాతకర్ణి కంటే ఇంకా భారీ స్థాయి సినిమా తీయాలనుకున్న క్రిష్ ఆశలు అడియాసలయ్యాయని తెలుస్తోంది. వెంకటేష్ 75వ సినిమాగా చెబుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికయితే మూలబడినట్లేనట. ఇప్పుడు సినిమా తీయకున్నా ఇరువురూ కలిసి భవిష్యత్తులో మరొక సినిమా తీయాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం లేదని తేలిపోయింది.
 
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గండి ఎక్కడ పడింది అని వాకబుచేస్తే కాపీ రైట్ సమస్య  అని తేలుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఒక నవల ఆధారంగా తయారైంది. కానీ ఆ పుస్తకం కాపీ రైట్స్ ఇంకా దర్శకుడికి లభ్యం కాకపోవడంతో చిత్రం అటకెక్కినట్లు తెలుస్తోంది. దీంతో ఏమీ చేయలేక క్రిష్ మరో వెంచర్ చూసుకుంటున్నట్లు సమాచారం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి 2లో షారుక్ కామియోనా? పగలబడి నవ్వుకుంటున్న ప్రభాస్