Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొమ్మలా నిలబడే పాత్రను ‘శ్రీమంతుడు’లో చేయమన్నారు.. వద్దని చెప్పేశా: నటి సుధ

కొరటాల శివ - మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం ఏ రేంజ్‌లో హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఇలాంటి చిత్రంలో నటించే గొప్ప అవకాశం వస్తే ఓ నటి మాత్రం వద్దని చెప్పేసిందట

బొమ్మలా నిలబడే పాత్రను ‘శ్రీమంతుడు’లో చేయమన్నారు.. వద్దని చెప్పేశా: నటి సుధ
, గురువారం, 27 ఏప్రియల్ 2017 (15:50 IST)
కొరటాల శివ - మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం ఏ రేంజ్‌లో హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఇలాంటి చిత్రంలో నటించే గొప్ప అవకాశం వస్తే ఓ నటి మాత్రం వద్దని చెప్పేసిందట. అలా చెప్పడానికి గల కారణాన్ని ఆమె ఇపుడు వెల్లడించింది. 
 
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మ పాత్రలకు పెట్టింది పేరు.. నిర్మలమ్మ, అన్నపూర్ణ. ఆ తర్వాతే ఎవరైనా సరే. వీరిద్దరి తర్వాత తెలుగులో అమ్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన నటి సుధ. తమిళనాడుకు చెందిన సుధ కష్టపడి తెలుగు నేర్చుకుని ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్చూ ఇచ్చింది. ఇందులో ఆమె అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘ఇప్పుడు అమ్మ పాత్రలంటే ఏదో ప్రాపర్టీలాగ అయిపోయింది. డైలాగ్‌లు కూడా లేకుండా ఏదో సైడ్‌ నిలబడే క్యారెక్టర్లే వస్తున్నాయి. 
 
ఇటీవలి కాలంలో ‘శ్రీమంతుడు’ సినిమాను అందుకే వదులుకున్నా. అంతకుముందు మహేష్‌తో ‘వంశీ’, ‘మురారి’, ‘అతడు’, ‘దూకుడు’ వంటి సినిమాల్లో మంచి రోల్స్‌ చేశాను. ‘శ్రీమంతుడు’లో కూడా మహేష్‌కు తల్లిగా నటించమని అడిగారు. కానీ, ఆ రోల్‌కు కనీస ప్రాధాన్యం కూడా లేదు. అందుకే ఆ పాత్ర చేయనని చెప్పాన’ని అని వివరించింది. కాగా, శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబు తల్లిగా, జగపతి బాబు భార్యగా సీనియర్ నటి సుకన్య నటించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి'ని చూసి వాతలు పెట్టుకుంటున్నారా? జై లవకుశ, సాహో, లై 'ఫ్యూచర్' టాలీవుడ్