Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిప్‌కిస్‌, బెడ్ సీన్స్ గురించి మీనాక్షి చౌదరి ఏమందంటే!

Advertiesment
Meenakshi Choudhary
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (13:05 IST)
Meenakshi Choudhary
కొన్నేళ్ళ క్రితం ఎన్నో భావోద్వేగాలతో నా లైఫ్‌ రోల్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగింది. ఎన్నోసార్లు కిందపడ్డాను. అయినా స్వశక్తితో నిలబడ్డాను. ప్రతి దశలోనూ చిరునవ్వు నాకు తోడుగా వుంటుందని నటి మీనాక్షి చౌదరి తెలిపింది. తాజాగా ఆమె మహేష్‌బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తోంది. అంతకుముందు అడవిశేష్‌తో హిట్‌2 చేసింది. ఖిలాడి, హత్య ఇచ్చట వాహనములు నిలపరాదు వంటి సినిమాలు చేసింది. 
 
webdunia
Meenakshi Choudhary
అయితే సినిమా అనేది గొప్ప అనుభవం. కొన్ని సన్నివేశాల్లో రొమాంటిక్‌గా నటించాలంటే అప్పటి సిట్యువేషన్‌. సీన్‌ పరిమితి బట్టి నటించాల్సి వస్తుందని తెలిపింది. హిట్‌2లో అడవిశేష్‌తో లిప్‌కిస్‌తోపాటు బెడ్‌ కూడా షేర్‌ చేసుకుంది. అలాంటి భామ తాజాగా వాకింగ్‌ చేస్తూ సూర్య కిరణాలు వెలుతురులో రోడ్డుపై నడుస్తున్న ఫొటో షేర్‌ చేసింది. కష్టం, సుఖం ఏదైనా సరే పరిస్తితిని బట్టి ముందుకుసాగినా మొహం ఎప్పుడు చిరునవ్వుతోనే వుండాలని సూచించింది. ఇది నెటిజన్లకు బాగా నచ్చింది. మంచి అప్లాజ్‌ ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమాకు ఆడిషన్‌ ఇవ్వడమే కష్టమంటున్న నుపూర్‌ సనన్‌