వల్గర్ అంటే ఏంటి... హైపర్ ఆది, రైజింగ్ రాజు
'జబర్దస్త్'... ప్రతి గురు, శుక్రవారమైతే చాలు బుల్లితెరప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయి మరీ కూర్చుంటారు. గంటపాటు ఆ కార్యక్రమాన్ని తథేకంగా చూస్తూ కడుపుబ్బ నవ్వుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్‌లో వల్
'జబర్దస్త్'... ప్రతి గురు, శుక్రవారమైతే చాలు బుల్లితెరప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయి మరీ కూర్చుంటారు. గంటపాటు ఆ కార్యక్రమాన్ని తథేకంగా చూస్తూ కడుపుబ్బ నవ్వుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్‌లో వల్గర్ ఎక్కువవుతోంది. మహిళలు అస్సలు చూడడం లేదు.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.
కొంతమందైతే జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రసారం చేయద్దంటూ సూచనలు ఇచ్చారు. అయితే ఎన్ని జరుగుతున్నా ఆ కార్యక్రమం మాత్రం ఆపలేదు అందులోని కమెడియన్లకు మాత్రం మంచి పేరు వస్తోంది. తిరుపతిలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన హైపర్ ఆది మీడియాతో మాట్లాడారు.
జబర్దస్త్ ఈ మధ్య వల్గర్‌గా తయారైందంటే ఆయన ఏ మాత్రం ఒప్పుకోలేదు. అస్సలు వల్గర్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇప్పుడు జబర్దస్త్ చూసే వారు మరింత ఎక్కువయ్యారని, తమను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు జబర్దస్త్ తర్వాత తనకు సినిమాల్లో కూడా అవకాశం వచ్చిందని, మూడు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నట్లు హైపర్ ఆది తెలిపారు. హైపర్ ఆది టీంలో తానుండడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు రైజింగ్ రాజు. ఆడవేషంలో తనకు వస్తున్న రెస్పాన్స్ అంతా కాదంటున్నారాయన. జబర్దస్త్‌లో నటించడం వల్లనే తమకు ఇంత పేరు వచ్చిందని సంతోషంగా చెబుతున్నారు.