Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుడు ఆ కోరిక విపరీతంగా వుండేది, కానీ ఇప్పుడది లేదు: హీరోయిన్ కామెంట్స్

Advertiesment
Andrea Jeremiah

ఐవీఆర్

, బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (13:29 IST)
ఇటీవలే విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించింది తమిళ హీరోయిన్ ఆండ్రియా. ఈ నటి మాట్లాడే మాటలు కాస్త విచిత్రంగానూ, ఆశ్చర్యకరంగానూ, సంచలనంగానూ వుంటుంటాయి. ఆమె చెప్పిన మాటలపై చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది. అసలు విషయం ఏంటయే అంటే... తాజాగా ఆమెను మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ఓ సినీ పిల్ల జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానంతో సదరు పిల్ల జర్నలిస్టుతో సహా మిగిలిన వారంతా షాకయ్యారు. ఇంతకీ ఆమె ఏమన్నదో తెలుసా?
 
నాకు 20 ఏళ్లు వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలని విపరీతమైన కోరిక వుండేది. ఆ కోరిక అలా నాకు 25 ఏళ్లు వచ్చేదాకా కలుగుతూనే వుండేది. కానీ ఎంత అనుకుంటే ఏం లాభం. నాకు నచ్చినవాడు దొరక్కపోవడంతో ఆ సమయంలో పెళ్లి కాలేదు. ఇప్పుడిక నా వయసు 40 ఏళ్ల దగ్గర్లో వుంది. ఇక ఇప్పుడు పెళ్లి గురించి కోరిక లేకుండా పోయింది.
 
పెళ్లి చేసుకుని సంతోషంగా లేకుండా గందరగోళంగా వున్నవారిని చూసినప్పుడు పెళ్లి చేసుకోకుండా వుంటేనే మంచిదనే భావన కలుగుతోంది. పైగా ఇప్పుడు నేను వంటరిగా వున్నా చాలా సంతోషంగా వుంటున్నాను. అలాంటప్పుడు ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు? నీకు అర్థమవుతుందా?" అని పిల్ల జర్నలిస్టుతో ఆండ్రియా అనేసింది. ఇంత విడమర్చి చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా ఎలా వుంటుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా లాగా ఎవరూ చేయొద్దు అంటున్న సునీల్